Monday, December 23, 2024
Home Blog Page 7

చైతన్యపురి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై బదిలీ వేటు.

0

చైతన్యపురి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై బదిలీ వేటు.

చైతన్యపురి జనవరి 23: గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ పై బదిలీ వేటుపడింది వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌లా పీఎస్‌ మారడం, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండంతో సీఐ నాగార్జునను రాచకొండ సీపీ సుధీర్‌ బాబు సస్పెండ్‌ చేశారు.ఆయనను మల్టీజోన్‌-2కు అటాచ్‌చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు చైతన్యపురి ఠాణాలో కోర్టు వారెంట్లు అమలు చేసే బృందంలోని హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్‌బాబు కానిస్టేబుల్ బీ. మల్లేశం కోర్టు కానిస్టేబుల్ ఎం.నరేందర్‌లు ఐదు రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడ్డారు.ఓ కేసులో నిందితుడి నుంచి రూ.3 లక్షలు లంచం వసూలు చేశారు ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ ముగ్గురు కాని స్టేబుళ్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించింది. ఈ తతంగం కొన్నాళ్లుగా నడుస్తున్నా ఇన్‌స్పెక్టర్ పసిగట్టక పోవడం లాంటి ఘటనలతోపాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాలతో ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు వేసినట్లు సమాచారం ప్రస్తుతం డీఐ నాగరాజ్ గౌడ్‌కు ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారనీ సమాచారం.

అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి మహోత్సవం

0

అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి మహోత్సవ

అష్టలక్ష్మి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపు.

గ్రేట్ తెలంగాణ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా.

అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామకృష్ణాపురంలోని అష్టలక్ష్మి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపు మహోత్సవంలో పాల్గొన్న రామకృష్ణాపురం డివిజన్ మాజీ కార్పొరేటర్, జిహెచ్ఏంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దేప సురేఖ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, పున్న గణేష్ నేత, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డుపల్లీ మహేందర్, గోపాల్ రెడ్డి, విజయ్, పూర్ణచంద్ర, శ్రీకాంత్ రెడ్డి, చౌకి సుమన్, సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భద్రత మనందరి భాధ్యత: ఆర్ టి వొ సుభాష్ చంద్రా రెడ్డి.

0

ఘనంగా మలక్ పెట్ రవాణా కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం- 2024 కార్యక్రమం.

భద్రత మనందరి భాధ్యత:  ఆర్ టి వొ సుభాష్ చంద్రా రెడ్డి.

మలక్ పెట్ జనవరి 22, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత. రోడ్డు నియమాలు పాటించి ప్రమాదాలను నివారించడంలో భాగంగా ఏటా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 15-012024 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రోడ్డు నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు చేపట్టనున్నారు.ఇవి ఫిబ్రవరి 14 వరకు జరగనున్నాయి కాగా మండలాల వారీగా ప్రతీరోజు మండల కేంద్రంలోని జంక్షన్లు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తీసుకునే చర్యలు, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై అవగాహన కల్పిస్తారు. ట్రాఫిక్‌ రూల్స్‌, ప్రమాదాల నివారణ, తదితర అంశాలపై సదస్సులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా మలక్ పెట్ రవాణా కార్యాలయంలో ఆర్ టి వొ సుభాష్ చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఆటోరిక్ష డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు నియమాలు పాటించాలని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత పై అవగాహన మరియు నిబంధనల అవశ్యకత గురించి వివరించారు.

నింబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి: ఆర్ టి వొ సుభాష్ చంద్ర రెడ్డీ, MVI లు.

రోడ్డు భద్రత నింబంధనలు పాటించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలనీ తెలిపారు కారు నడిపే వారు సీట్‌ బెల్ట్‌ తప్పని సరిగా పెట్టుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడపరాదు, మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాలు నడుపొద్దు. ఆటోలు, జీపులు ఇతర వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు. జాగ్రత్తలు పాటించి మన ప్రాణాలను కాపాడుకుందామని ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా మెలగాలని మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ లు తెలియజేశారు, స్కూల్ పిల్లలను 6గురికి మించి తీసుకెళ్లకూడదని., వారిని పాఠశాల నుండి ఇంటికి, ఇంటి నుండి పాఠశాలకు జాగ్రత్తగా తరలించాలని నిర్దేశించారు.ఆటో ప్రయాణం ముగ్గురికి మాత్రమేనని, ఆరు బడి పిల్లలకు మాత్రమేనని. బడి పిల్లలు డ్రైవర్ పక్కన కూర్చోకూడదని, టిఫిన్ బాక్స్, నీళ్ళ సీసాలు అడ్డుగా తగిలించకూడదని, బయటకు వెలాడదీయకూడదని హెచ్చరించారు.వారి అటోలకు భీమా, ఫిట్నెస్, పొల్యూషన్ మరియు అన్ని పత్రాలు సమయానికి పునరిద్దు రించుకోవాలని ఆర్ టి వొ సుభాష్ చంద్రా రెడ్డీ, ఎం వి ఐ లు సూచించారు.

పాఠశాల యాజమాన్యం మరియు తల్లి దండ్రులు తమ పిల్లల వాహనాల గురించి వాకబు చేస్తూ వుంటే ప్రమాదాలను అరికట్ట వచ్చని దీనికి సంబంధించి వారితో ప్రతిజ్ఞ చేయించారు, వాహనదారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదు, పొల్యూషన్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ తప్పని సరిగా ఎప్పుడు వాహనం నడిపేటప్పుడు తమ వెంట ఉంచుకోవాలని రవాణా శాఖ అధికారులు తెలిపారు, ఈ కార్యక్రమంలో యం వి ఐ లు రమేష్ బాబు, నరేంద్ర పాల్ సింగ్, ఉమ, మున్ని, అరుణ, ఏ ఏం వి ఐ లు, రజినీ సైదా ఎ ఓ లు విజయ్ ప్రవీణ్, మధుకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మహమ్మదాబాద్ గ్రామం లో బైక్ ర్యాలి.

0

అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మహమ్మదాబాద్ గ్రామం లో బైక్ ర్యాలి.

మహమ్మదాబాద్, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

 

ఈరోజు జరిగిన అయోధ్య రామ మందిరంలో రాముని ప్రతిష్ట సందర్భంగా మహమ్మదాబాద్ స్థానిక వీరాంజనేయ స్వామి దేవాలయం నీ సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసి భక్తులకు ఎల్ఈడి ద్వారా గ్రామ ప్రజలకు రాముని యొక్క ప్రతిష్టను లైవ్ ద్వార చూపించి ఆలయంలో హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు తర్వాత అన్నదానం చేశారు ఇందులో గ్రామ ప్రజలు అందరూ కలిసి తమవంతుగా కొంత వేసుకొని బ్రహ్మాండంగా వీరాంజనేయ స్వామిని, రాముడిని కొలిచారు, ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, కమతం ప్రదీప్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి ప్రతిమారెడ్డి గ్రామంలోని భజన మండలిలో శ్రీరామ జయరామ సంకీర్తన ద్వారా గ్రామంలో యువకులంతా కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

బిహెచ్ఈఎల్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమం విజయవంతం.

0

బిహెచ్ఈఎల్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమం విజయవంతం.

గ్రేట్ తెలంగాణ:జనవరి 21, (శేర్లింగంపల్లి ఇంచార్జి)

 

రామచంద్రాపురం: బీహెచ్ఈఎల్. ఆవిర్భవించిన తర్వాత ప్రప్రధమముగా బీహెచ్ఈఎల్. పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించబడి దినదిన ప్రవర్ధమానమై (50) యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమాన్ని అధికార బిహెచ్ఎల్. అధికార యూనియన్ ఆఫీసు ప్రాంగణంలో పెద్దమ్మతల్లి దేవాలయం ఎదురుగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి పద్మశాలి కులబాందవులందరూ ఆహ్వానితులేనని అధ్యక్షులు భూస రమేష్ , ప్రధాన కార్యదర్శి నారాయణ లు తెలిపారు. ఈ స్వర్ణోత్సవ సమ్మేళనం కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులకు , పద్మశాలి ప్రముఖులకు , విశిష్ట నాయకులకు సన్మానం మరియు మహిళలకు , చిన్నారులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమానికి పద్మశాలి కుల బాంధవులు , స్ధానిక నాయకులు , అభిమానులు , శ్రేయోభిలాషులు , ఆత్మీయ సమ్మేళనంలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

దిల్ సుఖ్ నగర్ లో లస్సీ స్టోర్ ప్రారంభం.

0

దిల్ సుఖ్ నగర్ లో లస్సీ స్టోర్ ప్రారంభ

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి.

దిల్ సుఖ్ నగర్,గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

దిల్ సుఖ్ నగర్ లో ఆదివారం నాడు జె.సి. బ్రదర్స్ ఎదురుగా, హనుమాన్ టెంపుల్ వెనుక, మెట్రో పిల్లర్ నెంబర్ 1525 నందు లస్సి స్టోర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. సంస్థ అధినేత చిన్ని సురేష్ మాట్లాడుతూ మా వద్ద బట్టర్ మిల్క్, లస్సి, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ షేక్స్, మోక్ టెయిల్స్, మడ్ షేక్స్, స్మూతిస్, ప్రోటీన్ షేక్స్, సిజలర్స్, ఫలుదా, కుల్ఫీ, తిక్ షేక్స్ మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్, కోల్డ్ కాఫీ, జ్యూస్ లు అన్నీ సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయని తెలిపారు. నా ద్వారా ఇంకో పది మందికి ఉపాధి లభించడం నాకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఐవిఎఫ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, చైతన్యపురి కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తా, ముసరాంబాగ్ కార్పోరేటర్ బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్ రెడ్డి, కొత్తపేట కార్పొరేటర్ నైకోటి పవన్ కుమార్, గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, డబ్ల్యూ ఏ ఎం ప్రెసిడెంట్ జిహెచ్ఎంసి ఎన్. గురుప్రసాద్, డబ్ల్యూ ఏ ఎం జనరల్ సెక్రటరీ పసుమర్తి మల్లికార్జునరావు, డబ్ల్యూ ట్రెజరర్ ఎల్.వి. కుమార్, గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ చింతల బాలరాజు గుప్తా, శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం చైర్మన్ ఊర నరసింహ గుప్తా, బిజెపి నాయకులు రాజేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

బ్లూ క్రాస్ వారు చేపట్టిన కార్యక్రమం మెచ్చుకోతగ్గది: కాలనీ వాసులు.

0

బ్లూ క్రాస్ వారు చేపట్టిన కార్యక్రమం మెచ్చుకోతగ్గది: కాలనీ వాసులు

గ్రేట్ తెలంగాణ:జనవరి 21, (శేర్లింగంపల్లి ఇన్చార్జి)

శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహ కల్ప లో బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో పెంపుడు చేపట్టిన కుక్కలకు , వీధి కుక్కలకు రేబిస్ వ్యాధి నిరోధక , ఫ్యామిలీ ప్లానింగ్ (బర్త్ కంట్రోల్ ) ఇంజెక్షన్స్ ను చేశారు. బ్లూ క్రాస్ వారు చేపట్టిన ఈ కార్యక్రమం మెచ్చుకోతగ్గదని కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బ్లూ క్రాస్ సిబ్బంది కి కాలనీ వాసులు అభినందనలతో ధన్యవాదాలు తెలిపారు.

2047  వరకు అభివృద్ధి చెందిన భారత్ మోడీ లక్ష్యం.

0

మోదీ లక్ష్యం 2047  వరకు అభివృద్ధి చెందిన భారత్

 

మహామ్మదాబాద్: గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

మహామ్మదాబాద్  మండల కేంద్రం పరిధిలోని చిన్నయపల్లి. మహమ్మదాబాద్. నంచర్ల. గువ్వొని కుంటతాండ. గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు, బీజేపీ మండల అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ యువత ఉచిత ప్రభుత్వపథకాలపై కాకుండా ఉపాధి సృష్టించే అవకాశాలకోసం ఎదురు చూడకుండా ముద్ర యోజన. విశ్వకర్మ యోజన పథకం వినియోగించుకొని ఉపాధి పొందాలని. కేంద్ర ప్రభుత్వం శురిటీ తో నిరుద్యోగ యూవతకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు

మరో వైపు ప్రధాన మంత్రి సురక్ష భీమా. జీవన్ జోతి. వినియోగించు కోవాలి.రైతులు మారుతున్న పరిస్థులకు అనుకూలంగా వ్యవసాయం చెయ్యాలని పొలాల్లో మందుల వాడకం తగ్గించాలి. అప్పుడే మన భూమి యొక్క నాణ్యత భవిష్యత్తు తరాలకు అందుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న వ్యవసాయ అధికారులు. డాక్టర్లు ఆశ వర్కర్లు. బ్యాంక్ అధికారులు. గ్రామ పంచాయతీ సర్పంచ్.పార్వతమ్మ రాజేశ్వర్ కార్యదర్శులు రాఘవేందర్. ఆంజనేయులు.శ్యాం సుందర్.అనురాధ . గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సరైన సమయంలో ఎంపిక అవకాశం, ప్రశాంతతకు ప్రాముఖ్యం : యోషిత -హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా .

0

సరైన సమయంలో ఎంపిక అవకాశం, ప్రశాంతతకు ప్రాముఖ్యం : యోషిత -హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా.

గ్రేట్ తెలంగాణ:జనవరి 21, (శేర్లింగంపల్లి ఇన్చార్జి)

యోషిత -హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు: స్థాన ముఖ్యాంశాలు: 100% వాస్తు , ప్రతిపాదిత నుండి 5 నిమిషాల డ్రైవ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ (RRR) ఆర్.ఆర్.ఆర్. పెద్దాపూర్ జంక్షన్ , సంఘం చుట్టూ కాంపౌండ్ వాల్ , (NH) ఎన్.హెచ్ 65 ముంబై హైవే నుండి 6 కి.మీ, అంతర్గత బ్లాక్ టాప్ రోడ్లు 40/33 అడుగులు , సంగారెడ్డి నుండి 8 కి.మీ , వీధిలైట్లతో విద్యుత్ పెప్సికోకు 10 నిమిషాల ప్రయాణం (MRF) ఎమ్.ఆర్ఎఫ్. కంపెనీకి 15 నిమిషాల డ్రైవ్ , సెప్టిక్ ట్యాంక్‌తో భూగర్భ డ్రైనేజీ, (IIT) ఐఐటీ ఖండి నుండి 15 నిమిషాలు , పిల్లల ఆట స్థలం , ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డు సమీపంలో జాగర్స్ ట్రాక్ మరియు ఎల్డర్స్ ఏరియా , అనుసంధానించే రహదారిపై ప్రాజెక్ట్ , ల్యాండ్‌స్కేపింగ్‌తో అవెన్యూ ప్లాంటేషన్ & పార్కులు మల్కాపూర్ , శంకర్‌పల్లి రాష్ట్ర రహదారి ప్రతి ప్లాట్‌కు నీటి కనెక్షన్ , క్రౌన్ , ప్రతిపాదిత మోనిన్ సిరప్ ఫ్యాక్టరీ వంటి ఎమ్.ఎన్.సీ. ల దగ్గర మెరుస్తున్న టైల్స్‌తో ఫుట్‌పాత్ , స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్: టెన్నిస్, క్రికెట్, ఫుట్‌బాల్. చుట్టుపక్కల అభివృద్ధి , ఇండస్ట్రియల్ క్లస్టర్‌లు, ఐటీ వర్క్ జోన్‌లు, శాటిలైట్ టౌన్‌షిప్‌లు, లాజిస్టిక్స్ పార్క్స్ మాల్స్ మరియు కమర్షియల్ బిల్డింగ్‌లు. బాస్కెట్‌బాల్ అండ్ యాంఫిథియేటర్. ప్రకాశించే ప్రశాంతత , సరైన సమయంలో సరైన ఎంపిక అవకాశం, శ్రేయస్సు యొక్క ప్రపంచాన్ని ప్లాన్ చేయడం ప్రశాంతత అనేది ప్రాముఖ్యం.

పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో రాగం నాగేందర్ యాదవ్ .

0

పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో రాగం నాగేందర్ యాదవ్. 

గ్రేట్ తెలంగాణ:జనవరి 21, (శేర్లింగంపల్లి ఇంచార్జి)

రామచంద్రపురంలో బీహెచ్ఈఎల్. ఆవిర్భవించిన తరువాత ప్రప్రథమముగా బీహెచ్ఈఎల్. పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ దినదిన ప్రవర్ధమానమై (50) యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా ఏర్పాటుచేసిన స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో ఆర్.సి పురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ , జడ్జి నామాల అశోక్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్ రావు, సీనియర్ నాయకులు రామ్ మోహన్ రెడ్డి లతో కలిసి ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీహెచ్ఇఎల్. పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ వారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, బీహెచ్ ఈ ఎల్. పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ తో ఉన్న అనుబందం , అనుభూతులను తెలియజేసారు. ఈ స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులను, పద్మశాలి ప్రముఖులను, విశిష్ట నాయకులను ఘనంగా సన్మానించారు. మహిళలకు, చిన్నారులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిహెచ్ఇఎల్. పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుస రమేష్, జనరల్ సెక్రటరీ చెరుపల్లి వీణ నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మధుసూదన్, చీఫ్ పట్రోన్ చెరుపల్లి సోమదాస్, వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్, కరుణాకర్, శ్రీహరి, గోపాల్ యాదవ్, సుధాకర్ రెడ్డి, సైదులు ట్రెజరర్లు, జాయింట్ సెక్రటరీస్, ఆర్గనైజర్ సెక్రటరీస్, చీఫ్ అడ్వైజర్స్, అడ్వైజర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ , తదితరులు పాల్గొన్నారు.