పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో రాగం నాగేందర్ యాదవ్.
గ్రేట్ తెలంగాణ:జనవరి 21, (శేర్లింగంపల్లి ఇంచార్జి)
రామచంద్రపురంలో బీహెచ్ఈఎల్. ఆవిర్భవించిన తరువాత ప్రప్రథమముగా బీహెచ్ఈఎల్. పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ దినదిన ప్రవర్ధమానమై (50) యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా ఏర్పాటుచేసిన స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో ఆర్.సి పురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ , జడ్జి నామాల అశోక్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్ రావు, సీనియర్ నాయకులు రామ్ మోహన్ రెడ్డి లతో కలిసి ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీహెచ్ఇఎల్. పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ వారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, బీహెచ్ ఈ ఎల్. పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ తో ఉన్న అనుబందం , అనుభూతులను తెలియజేసారు. ఈ స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులను, పద్మశాలి ప్రముఖులను, విశిష్ట నాయకులను ఘనంగా సన్మానించారు. మహిళలకు, చిన్నారులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిహెచ్ఇఎల్. పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుస రమేష్, జనరల్ సెక్రటరీ చెరుపల్లి వీణ నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మధుసూదన్, చీఫ్ పట్రోన్ చెరుపల్లి సోమదాస్, వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్, కరుణాకర్, శ్రీహరి, గోపాల్ యాదవ్, సుధాకర్ రెడ్డి, సైదులు ట్రెజరర్లు, జాయింట్ సెక్రటరీస్, ఆర్గనైజర్ సెక్రటరీస్, చీఫ్ అడ్వైజర్స్, అడ్వైజర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ , తదితరులు పాల్గొన్నారు.