ఘనంగా మలక్ పెట్ రవాణా కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం- 2024 కార్యక్రమం.
భద్రత మనందరి భాధ్యత: ఆర్ టి వొ సుభాష్ చంద్రా రెడ్డి.
మలక్ పెట్ జనవరి 22, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత. రోడ్డు నియమాలు పాటించి ప్రమాదాలను నివారించడంలో భాగంగా ఏటా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 15-012024 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రోడ్డు నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు చేపట్టనున్నారు.ఇవి ఫిబ్రవరి 14 వరకు జరగనున్నాయి కాగా మండలాల వారీగా ప్రతీరోజు మండల కేంద్రంలోని జంక్షన్లు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తీసుకునే చర్యలు, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై అవగాహన కల్పిస్తారు. ట్రాఫిక్ రూల్స్, ప్రమాదాల నివారణ, తదితర అంశాలపై సదస్సులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా మలక్ పెట్ రవాణా కార్యాలయంలో ఆర్ టి వొ సుభాష్ చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఆటోరిక్ష డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు నియమాలు పాటించాలని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత పై అవగాహన మరియు నిబంధనల అవశ్యకత గురించి వివరించారు.
నింబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి: ఆర్ టి వొ సుభాష్ చంద్ర రెడ్డీ, MVI లు.
రోడ్డు భద్రత నింబంధనలు పాటించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనీ తెలిపారు కారు నడిపే వారు సీట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడపరాదు, మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాలు నడుపొద్దు. ఆటోలు, జీపులు ఇతర వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు. జాగ్రత్తలు పాటించి మన ప్రాణాలను కాపాడుకుందామని ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా మెలగాలని మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ లు తెలియజేశారు, స్కూల్ పిల్లలను 6గురికి మించి తీసుకెళ్లకూడదని., వారిని పాఠశాల నుండి ఇంటికి, ఇంటి నుండి పాఠశాలకు జాగ్రత్తగా తరలించాలని నిర్దేశించారు.ఆటో ప్రయాణం ముగ్గురికి మాత్రమేనని, ఆరు బడి పిల్లలకు మాత్రమేనని. బడి పిల్లలు డ్రైవర్ పక్కన కూర్చోకూడదని, టిఫిన్ బాక్స్, నీళ్ళ సీసాలు అడ్డుగా తగిలించకూడదని, బయటకు వెలాడదీయకూడదని హెచ్చరించారు.వారి అటోలకు భీమా, ఫిట్నెస్, పొల్యూషన్ మరియు అన్ని పత్రాలు సమయానికి పునరిద్దు రించుకోవాలని ఆర్ టి వొ సుభాష్ చంద్రా రెడ్డీ, ఎం వి ఐ లు సూచించారు.
పాఠశాల యాజమాన్యం మరియు తల్లి దండ్రులు తమ పిల్లల వాహనాల గురించి వాకబు చేస్తూ వుంటే ప్రమాదాలను అరికట్ట వచ్చని దీనికి సంబంధించి వారితో ప్రతిజ్ఞ చేయించారు, వాహనదారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదు, పొల్యూషన్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ తప్పని సరిగా ఎప్పుడు వాహనం నడిపేటప్పుడు తమ వెంట ఉంచుకోవాలని రవాణా శాఖ అధికారులు తెలిపారు, ఈ కార్యక్రమంలో యం వి ఐ లు రమేష్ బాబు, నరేంద్ర పాల్ సింగ్, ఉమ, మున్ని, అరుణ, ఏ ఏం వి ఐ లు, రజినీ సైదా ఎ ఓ లు విజయ్ ప్రవీణ్, మధుకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.