బిహెచ్ఈఎల్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమం విజయవంతం.
గ్రేట్ తెలంగాణ:జనవరి 21, (శేర్లింగంపల్లి ఇంచార్జి)
రామచంద్రాపురం: బీహెచ్ఈఎల్. ఆవిర్భవించిన తర్వాత ప్రప్రధమముగా బీహెచ్ఈఎల్. పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించబడి దినదిన ప్రవర్ధమానమై (50) యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమాన్ని అధికార బిహెచ్ఎల్. అధికార యూనియన్ ఆఫీసు ప్రాంగణంలో పెద్దమ్మతల్లి దేవాలయం ఎదురుగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి పద్మశాలి కులబాందవులందరూ ఆహ్వానితులేనని అధ్యక్షులు భూస రమేష్ , ప్రధాన కార్యదర్శి నారాయణ లు తెలిపారు. ఈ స్వర్ణోత్సవ సమ్మేళనం కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులకు , పద్మశాలి ప్రముఖులకు , విశిష్ట నాయకులకు సన్మానం మరియు మహిళలకు , చిన్నారులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమానికి పద్మశాలి కుల బాంధవులు , స్ధానిక నాయకులు , అభిమానులు , శ్రేయోభిలాషులు , ఆత్మీయ సమ్మేళనంలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.