అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మహమ్మదాబాద్ గ్రామం లో బైక్ ర్యాలి.
మహమ్మదాబాద్, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
ఈరోజు జరిగిన అయోధ్య రామ మందిరంలో రాముని ప్రతిష్ట సందర్భంగా మహమ్మదాబాద్ స్థానిక వీరాంజనేయ స్వామి దేవాలయం నీ సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసి భక్తులకు ఎల్ఈడి ద్వారా గ్రామ ప్రజలకు రాముని యొక్క ప్రతిష్టను లైవ్ ద్వార చూపించి ఆలయంలో హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు తర్వాత అన్నదానం చేశారు ఇందులో గ్రామ ప్రజలు అందరూ కలిసి తమవంతుగా కొంత వేసుకొని బ్రహ్మాండంగా వీరాంజనేయ స్వామిని, రాముడిని కొలిచారు, ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, కమతం ప్రదీప్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి ప్రతిమారెడ్డి గ్రామంలోని భజన మండలిలో శ్రీరామ జయరామ సంకీర్తన ద్వారా గ్రామంలో యువకులంతా కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.