దిల్ సుఖ్ నగర్ లో లస్సీ స్టోర్ ప్రారంభ
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి.
దిల్ సుఖ్ నగర్,గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
దిల్ సుఖ్ నగర్ లో ఆదివారం నాడు జె.సి. బ్రదర్స్ ఎదురుగా, హనుమాన్ టెంపుల్ వెనుక, మెట్రో పిల్లర్ నెంబర్ 1525 నందు లస్సి స్టోర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. సంస్థ అధినేత చిన్ని సురేష్ మాట్లాడుతూ మా వద్ద బట్టర్ మిల్క్, లస్సి, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ షేక్స్, మోక్ టెయిల్స్, మడ్ షేక్స్, స్మూతిస్, ప్రోటీన్ షేక్స్, సిజలర్స్, ఫలుదా, కుల్ఫీ, తిక్ షేక్స్ మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్, కోల్డ్ కాఫీ, జ్యూస్ లు అన్నీ సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయని తెలిపారు. నా ద్వారా ఇంకో పది మందికి ఉపాధి లభించడం నాకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఐవిఎఫ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, చైతన్యపురి కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తా, ముసరాంబాగ్ కార్పోరేటర్ బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్ రెడ్డి, కొత్తపేట కార్పొరేటర్ నైకోటి పవన్ కుమార్, గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, డబ్ల్యూ ఏ ఎం ప్రెసిడెంట్ జిహెచ్ఎంసి ఎన్. గురుప్రసాద్, డబ్ల్యూ ఏ ఎం జనరల్ సెక్రటరీ పసుమర్తి మల్లికార్జునరావు, డబ్ల్యూ ట్రెజరర్ ఎల్.వి. కుమార్, గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ చింతల బాలరాజు గుప్తా, శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం చైర్మన్ ఊర నరసింహ గుప్తా, బిజెపి నాయకులు రాజేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.