బ్లూ క్రాస్ వారు చేపట్టిన కార్యక్రమం మెచ్చుకోతగ్గది: కాలనీ వాసులు
గ్రేట్ తెలంగాణ:జనవరి 21, (శేర్లింగంపల్లి ఇన్చార్జి)
శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహ కల్ప లో బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో పెంపుడు చేపట్టిన కుక్కలకు , వీధి కుక్కలకు రేబిస్ వ్యాధి నిరోధక , ఫ్యామిలీ ప్లానింగ్ (బర్త్ కంట్రోల్ ) ఇంజెక్షన్స్ ను చేశారు. బ్లూ క్రాస్ వారు చేపట్టిన ఈ కార్యక్రమం మెచ్చుకోతగ్గదని కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బ్లూ క్రాస్ సిబ్బంది కి కాలనీ వాసులు అభినందనలతో ధన్యవాదాలు తెలిపారు.