Tuesday, December 24, 2024
Home Blog Page 8

తెలంగాణ లైసెన్సింగ్ బోర్డ్ మెంబర్ నేమాల బెనర్జీ కి సన్మానం  తెలంగాణ లైసెన్సింగ్ బోర్డ్ మెంబర్ నేమాల బెనర్జీ కి సన్మానం.

0

తెలంగాణ లైసెన్సింగ్ బోర్డ్ మెంబర్ నేమాల బెనర్జీ కి సన్మానం  తెలంగాణ లైసెన్సింగ్ బోర్డ్ మెంబర్ నేమాల బెనర్జీ కి సన్మానం.

బాలాపూర్ మండల కమిటీ డైరీ క్యాలండర్ అవిష్కరణ. 

హైదరాబాద్ గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

తెలంగాణ బి గ్రేడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం అశోక కాన్ఫరెన్స్ హాల్ నందు. తెలంగాణ లైసెన్సింగ్ బోర్డు మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా. నేమాల బెనర్జీ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. తెలంగాణ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల పైన. కాంట్రాక్ట ర్ లకు సకాలంలో బిల్లు వచ్చే విధానం పైన.డబ్ల్యూ ఆర్ వన్.డబ్ల్యూ ఆర్ టు. తెలంగాణ వ్యాప్తంగా ఇంప్లిమెంటన్ చేయాలని. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ డబ్ల్యూ ఆర్ వన్ డబ్ల్యూ ఆర్ టు ఇది తెలంగాణలో. కొన్ని జిల్లాల్లో పరిమితమై ఉన్నది కావున. తెలంగాణ వ్యాప్తంగా. ఇంప్లిమెంటేషన్ చేయాలని. తెలంగాణ బీ గ్రేడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి అన్నారు. బిగ్రేడు కాంట్రాక్టర్ వల్ల ఎటువంటి లబ్ధి చేకూర్చలేదు కావున. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా. దీనిని ఇంప్లిమెంటేషన్ చేయాలని తెలంగాణ బి గ్రేడ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వాళ్లు డిమాండ్ చేశారు. అదేవిధంగా బాలాపూర్ మండల కమిటీ నూతనంగా ఏర్పడిన సందర్భంగా. ఈ డిమాండ్ చేయడం జరిగింది. దానితోపాటు బాలాపూర్ మండల కమిటీ. నూతనంగా డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించబడ్డది. ఈ కార్యక్రమంలో. తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మెంబర్ నేమాల బెనర్జీ. రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి. రఘు. సయ్యద్ భాషా భాయ్. మల్లేష్ యాదవ్. ఉదయ భాస్కర్. కొండ బాల్ రెడ్డి .ఆర్. శ్రీనివాస్. పొదిల గోవర్ధన్ కాశి నాయుడు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో పొందుపరిచేందుకు కృషి చేస్తా: బండి రమేష్.

0

ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో పొందుపరిచేందుకు కృషి చేస్తా: బండి రమేష్.

గ్రేట్ తెలంగాణ:జనవరి 20, (శేర్లింగంపల్లి ఇంచార్జి

నవరస నట సార్వభౌముడు, రాజకీయ దురంధరుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి పురస్కరించుకొని గురువారం రోజున వసంత్ నగర్ కాలనీ బస్ స్టాప్ లో ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ సర్కిల్ , నిజాంపేట్ రోడ్డు పేర్లను ఎన్టీఆర్ సర్కిల్ , ఎన్టీఆర్ మార్గ్ గా మార్చే విధంగా తన వంతు కృషి చేస్తానని అదేవిధంగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో పొందుపరిచే విధంగా తన వంతు కృషి చేస్తానని అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పిశెట్టి దినేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు మధు , గోపి, ఉమా , సత్తార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ , సాంబశివరావు , వివిధ కాలనీ నుండి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన..

0

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన.

గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా.!

సర్పంచ్‌ల ప్లేస్‌లో ఎవరిని నియమిస్తారు.

హైదరాబాద్ జనవరి 20, గ్రేట్ తెలంగాణ న్యూస్.

తెలంగాణ రాష్ట్రం లో సర్పంచ్‌ లకు ఉన్న చెక్ పవర్‌ను ఎవరికి ఇస్తారు గ్రామాల్లో పాలన ను ఎవరు కొనసాగిస్తారు అనేక అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పంచాయతీ రాజ్ అధికారులపై ఉన్నది అయితే వచ్చే నెల 1వ తేదీతో ఇప్పుడు ఉన్న సర్పంచ్‌ల పదవికాలం ముగుస్తుంది మరి మరికొన్ని రోజులు సర్పంచ్‌ల పదవి కాలాన్ని కొనసాగిస్తారా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా.

వచ్చే నెల 1వ తేదితో సర్పంచ్‌ల పదవి కాలం ముగుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహణ కష్టం అని భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఎన్నికల నిర్వహణకు కనీసం 3 నెలల సమయం కావాలి అంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. కానీ అంత సమయం లేకపోవడంతో ఈ సర్పంచ్‌ల పదవి కాలాన్ని పొడిగిస్తారా లేక ప్రత్యేక అధికారి పాలన పెడతారా అనేది స్పష్టం చేయడం లేదు ప్రభుత్వం. గ్రామాల్లో ఉన్న సమస్యలు, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తాం అని చెప్పిన 6 గ్యారెంటీలు ఎలా.? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయితీ సర్పంచ్‌లు. మరోవైపు గ్రామసభలు పెడితే 6 గ్యారెంటీలతో పాటు, ఇతర హామీలపై ప్రభుత్వాన్ని, అధికారులను ఎక్కడ నిలదీస్తారో అని ఎన్నికలను వాయిదా వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు గ్రామ సర్పంచ్‌లు. సర్పంచ్‌ల పదవికాలం ముగియడంతో గ్రామ పంచాయితీ చెక్ పవర్ ఎవరికి ఇస్తారో అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఆయితే ఎంపిడిఓతో పాటు గ్రామ కార్యదర్శికి ఇస్తారా.. లేక ఎమ్మార్వో, పంచాయతీ రాజ్ ఇంజనీర్‌లకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారా.. అదీకాక 4 గ్రామాలకు ఒక్క మండల స్థాయి అధికారిని ఇంచార్జిగా నియమించి వారికే చెక్ పవర్ ఇస్తారా.? అనే అంశం ఇంకా తేలాల్సి ఉంది. అయితే గతంలో 4,5 గ్రామాలకు ఒక్క మండల స్థాయి అధికారిని నియమించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చారు. ఈసారి కూడా గతం మాదిరిగానే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా.. సమయానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి కూడా అదే తరహా వ్యవహరిస్తోంది అంటున్నారు సర్పంచ్‌లు. అసలే గ్రామాల్లో రైతులకు రైతు బంధు అమలు చేయలేదు. ఎన్నికల్లో గెలవగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం అని చెప్పిన సీఎం ఇప్పటివరకు దానిపై సమీక్ష జరపలేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహిస్తే గెలువం అనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రత్యేక అధికారి పాలన తేవాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గ్యారెంటీలు అమలు చేసి కొన్ని పథకాలు లబ్ధిదారులకు అందించాక గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతే లాభం చేకూరుతుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ సర్పంచ్‌లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అంతేకాదు గ్రామాల్లో బీఆర్ఎస్‌కు బలమైన క్యాడర్ ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందని అని అంటున్నారు. అందుకే ప్రత్యేక అధికారి పాలన పెట్టి గ్రామాల్లో కొన్నైనా హామీలు అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తోంది అని సమాచారం. అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

18 సంవత్సరాల వయసు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిసిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.

0

18 సంవత్సరాల వయసు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిసిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

మనోహరబాద్ జనవరి 20, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

మనోహరాబాద్ మండల కేంద్రంలొని ఓటరు నమోదు కేంద్రాలను సందర్శించి నమోదు ప్రక్రియను పరిశీలించారు.18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్క యువతి యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు యువతకు సూచించారు. అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం ఓటు హక్కు అని అయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కౌషిక, అర్ఐ దిక్షిత్, సిబ్బంది సంపత్ ,బిఎల్వో లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను అమలు చేసే వరకు ఉద్యమిస్తాం: రాష్ట్ర 57 ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాదక్షులు చంద్రగిరి సత్యనారాయణ.

0

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను అమలు చేసే వరకు ఉద్యమిస్తాం: రాష్ట్ర 57 ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాదక్షులు చంద్రగిరి సత్యనారాయణ.

హైదరాబాద్ బ్యూరో, గ్రేట్ తెలంగాణ న్యూస్.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను అమలు చేసే వరకు ఉద్యమిస్తామని రాష్ట్ర 57 ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాదక్షులు చంద్రగిరి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ నెల 21వ తేది నాడు ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన హామీల అమలు- కేంద్ర ప్రభుత్వ వివక్షతపై నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు చంద్రగిరి సత్యనారాయణ తన నాయకుల బృందంతో కోదండరామ్ ని కలసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరణ చేయటంలో చూపిస్తున్న శ్రద్ధ రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరణ చేసి దేశంలో ఎస్సీ రిజర్వేషన్లు లేకుండా కుట్ర చేస్తు నిరుద్యోగ సమస్యలను పెంచి పోషిస్తున్నారన్నారు. విభజన హామీలను వెంటనే అమలు చేయకపోతే పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల ఉపకులాల నాయకులు సమగర శివ శంకర్,శివ మాన్కార్, శ్రీనివిస్, బలరాం సల్లా సతీష్, సాయులు , మారుతీ కేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.

నందమూరి తారక రామారావు కు నివాళులర్పించిన కట్ట వెంకటేష్ గౌడ్.

0

నందమూరి తారక రామారావు కు నివాళులర్పించిన కట్ట వెంకటేష్ గౌడ్.

గ్రేట్ తెలంగాణ:జనవరి 18, (శేర్లింగంపల్లి ఇన్చార్జి)

శేరిలింగంపల్లి డివిజన్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆఫీసులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి కట్ట వెంకటేష్ గౌడ్ , రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ సుభాషిని, డివిజన్ ల అధ్యక్షులు ఏరువ సాంబశివ గౌడ్, బిఎస్ఎన్ కిషోర్ యాదవ్, కడియాల రాజేందర్ బాబు, చిట్టిబాబు, బాలాజీ,సోమ మధుమోహన్, శ్రీనివాసరావు,రామారావు, రామకృష్ణ గౌడ్,రాహుల్ గౌడ్, వెంకటేశ్వర్లు, క్రాంతి, అభిమానులు ,కార్యకర్తలు పాల్గొని అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు కి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కట్ట వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, నాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి కూడు, గుడ్డ, నీడ, అనే నినాదంతో ముందుకెళ్లి ఆరు నెలల్లో ముఖ్యమంత్రి అయినా ఏకైక నాయకుడు తారక రామారావు అన్నారు. అలాగే తెలంగాణలో బడుగు బలహీన వర్గాలను పట్టి పీడించిన పటేల్ పట్వారి అవస్థను రద్దుచేసి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన గొప్ప నాయకుడు అని గుర్తు చేశారు.

ఉర్స్ పర్వదినం సందర్బంగా తోటి మిత్రులను శాలవాలతో సత్కరించిన జర్నలిస్టు షకీల్ .

0

ఉర్స్ పర్వదినం సందర్బంగా తోటి మిత్రులను శాలవాలతో సత్కరించిన జర్నలిస్టు షకీల్ 

గ్రేట్ తెలంగాణ:జనవరి18, (శేర్లింగంపల్లి ఇన్చార్జి)

శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ లో ఉర్స్ పర్వదిన శుభ సందర్బాన్ని పురస్కరించుకొని జర్నలిస్టు షకీల్ తన తోటి మిత్రులైన కొండా శ్రీనివాసు , శ్రీనివాస్ మరియు కుమార్ లను గౌరవప్రదంగా పూలమాలలతో, శాలువాల తో సత్కరించారు. ఈ నేపథ్యంలో శాలువాలతో సత్కరించిన జర్నలిస్ట్ మిత్రుదు షకిల్ కు కొండా శ్రీనివాసు, శ్రీనివాసు , కుమార్ లు ఉర్సు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు ఎల్లవేళలా ఉండేలా భగవంతుని వేడుకొన్నట్లుగా తెలియజేశారు.

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎం.ఆర్.ఓ. 

0

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎం.ఆర్.ఓ.

గ్రేట్ తెలంగాణ:జనవరి18, (శేర్లింగంపల్లి ఇన్చార్జి)

శేరిలింగంపల్లి జన చైతన్య ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ , బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండల కార్యాలయ ఆవరణలో శేరిలింగంపల్లి ఎం.ఆర్.ఓ. చేతుల మీదుగా 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ. ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న జెసి చీఫ్ అడ్వైజర్, జన చైతన్య ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహ, సలహాదారు అశోక్, కార్యదర్శి సుధాకర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పెంటయ్య కార్యవర్గం , తదితరులు పాల్గొన్నారు.

సహజంగా సహాయ తత్వం కలిగిన ప్రతి ఒక్కరు ఆదర్శమూర్తులే : ప్రజలు.

0

సహజంగా సహాయ తత్వం కలిగిన ప్రతి ఒక్కరు ఆదర్శమూర్తులే : ప్రజలు

గ్రేట్ తెలంగాణ:జనవరి 17, (శేర్లింగంపల్లి ఇన్చార్జి)

పది మందికి మంచి జరిగే పని ఏదైనా సరే పేరు కోసం కాకుండా సమాజ క్షేమం కోసం అనుకునేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. సహాయం చేయాలని, అందరికి మంచి జరిగే కార్యక్రమాన్ని మాటలతో కాకుండా చేతలతో చూపించాలని సహజంగా సహాయతత్వం కలిగిన ప్రతి ఒక్కరు ఆదర్శమూర్తులుగా చెప్పుకోవడం సమాజ ధర్మం. అలాంటి వారిలో కొందరు మంచి జరగటమే ముఖ్యమని ఆలోచించేవారిని చేతులెత్తి నమస్కరించుకోవడం మన సంస్కృతి. ఆ కోవకు చెందిన కొందరిని మనం జ్ఞాపకం చేసుకోవడం మన అదృష్టంగా భావించాలి. వివరాల్లోకి వెళ్తే , శేరిలింగంపల్లి డివిజన్ పరిధి పాపిరెడ్డి కాలనీలో చెరువు సమీపంలోని డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందిగా మారి, దుర్వాసనతో అనారోగ్యం వాతావరణ పరిస్థితులు కల్పిస్తున్న నేపథ్యంలో బస్తీలో నివాసితులైన మాల కొండయ్య అందరి క్షేమాన్ని , ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ముందడుగు వేసి ప్రతి ఒక్కరిని అనారోగ్య పరిస్థితులను కల్పిస్తున్న డ్రైనేజీ పొంగిపొర్లకుండా చర్యలు చేపట్టే దిశగా ముందుకు వెళ్దామని విషయం తెలియపరచగా అందుకు బస్తీ వాసులు సానుకూలంగా స్పందించి కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు వచ్చిన మాలకొండయ్య ను ప్రతి ఒక్కరు అభినందించారు. అనంతరం ,తమ వంతుగా కొంత డబ్బు రూపంలో చేయూత అందించారు . ఎవరి పనుల్లో వారు బిజీగా తీరిక లేకుండా ఉండటంతో ముందుకు వచ్చి సమస్యను పరిష్కరిస్తున్నందుకు చాలా సంతోషం అంటూ కృతజ్ఞతా పూర్వకంగా అభినందనలతో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మాలకొండయ్య శ్రద్ధగా , అంకితభావంతో డ్రైనేజీ పొంగి పొర్లకుండా తనకున్న నైపుణ్యతతో సత్వర చర్యలు చేపట్టి డ్రైనేజీ మురుగునీరు ప్రవాహాన్ని రోడ్డుపై చేరకుండా నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో బస్తివాసులందరూ ఆరోగ్యవాతావరణానికి పూర్తి శ్రద్ధ చూపిస్తూ , నిర్మాణాన్ని పూర్తిచేసిన మాలకొండయ్య ను అభినందిస్తూ ఇలాంటి వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పరిగి ఎమ్మెల్యే టి. రాం మోహన్ రెడ్డి.

0

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పరిగి ఎమ్మెల్యే టి. రాం మోహన్ రెడ్డి.

కృతజ్ఞతలు తెలిపిన గ్రామ మాజీ సర్పంచ్ రాం లాల్ , గ్రామ ప్రజలు.

మహమ్మదాబాద్ జనవరి11. గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

నాడు మహమ్మదాబాద్ లో జరిగిన ప్రజా పాలన గ్రామ సభలో నీటి కొరత గురించి మాజి.సర్పంచ్ రాంలాల్ అడగగా పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి బోరు వేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే ఆదేశానుసారం మహమ్మదాబాద్ గురువారము గ్రామ కో ఆపరేటివ్ బ్యాంకు వెనకాల బోరు వేయడం జరిగింది ,ఇట్టి కార్యక్రమములో మాజి.సర్పంచ్ రాంలాల్ గారు, డిసిసి ఉపాధ్యక్షులు కే.విష్ణువర్ధన్, గారు మండల పార్టీ ప్రెసిడెంట్ నారాయణ గారు వెన్నచెడ్ పసర్పంచ్ పులిందర్ రెడ్డి, మాజి.కో ఆప్షన్ డా.యస్ కె రహీం, md, హైమద్ ఖురేషి, ఎండీ.సమీ, గద్దె బాలరాజ్, శ్రవణ్, వెంకటయ్య ,సమీ మక్బుల్, మీర్జా బైగ్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు కాలనీవాసులు పాల్గొని హర్షం వ్యక్తం చేసారు అలాగే ఎమెల్ల్యే టి రామ్మోహన్ రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపారు.