పేద విద్యార్థికి పెద్ద మనసుతో సహాయం చేసిన మనసున్న మారాజు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్.
హైదరాబాద్/ జనవరి 27, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దీప్తి అనే పేద విద్యార్థికి శనివారము ఆర్టిఐ మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ గారు పెద్ద మనసుతో హాస్టల్ ఫీజు కోసం 25 వేల రూపాయలు సహాయం చేయడం పట్ల బలహీనవర్గాల రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు జే.క్రాంతి త్రినేత్రుడు అభినందనలు తెలిపారు.
ప్రేమే లక్ష్యంగా సేవే మార్గంగా నిరంతరం పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప వ్యక్తిగా డాక్టర్ వర్రె.వెంకటేశ్వర్లు యాదవ్ చరిత్రలో నిలిచిపోయారని క్రాంతి పేర్కొన్నారు.మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడు తల్లిని కోల్పోయిన దీప్తి యాదవ్ తండ్రికి చిన్ననాటి నుండి డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ గారు పెద్దదిక్కుగా నిలిచారనీ క్రాంతి పేర్కొన్నారు.పేద బిడ్డలు పెద్ద చదువులు చదవాలని తన తండ్రి రాఘవయ్య మాస్టర్ ఇచ్చిన ప్రేరణతో ఉన్నత విద్యలు అభ్యసించిన డాక్టర్ గొర్రె వెంకటేశ్వర్లు యాదవ్… తన తండ్రి ఆశయ సాధన లో భాగంగా నిరంతరం పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని క్రాంతి తెలిపారు.పేద వర్గాల ఆత్మీయుడు, అభ్యుదయ వాది డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు యాదవ్ గారికి ఈ సందర్భంగా అభినందనలు,హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బలహీనవర్గాల రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకులు నేతాజీ రాజన్న.