కామన్ సర్వీస్ సెంటర్ (ఆధార్ సెంటర్) ను ప్రారంబించిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్.
మేడ్చల్ జిల్లా, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
ప్రస్తుతం ఇండియా మొత్తం డిజిటల్ యుగంగా మార్పు చెందుతుంది ఏది కోరితే అది క్షణాల్లో మన ముందు అందుబాటులొ ఉంటుంది ప్రతి ఒక్కరూ డిజిటల్ యుగం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో చర్లపల్లి లో అందరికి అందుబాటులో ఉండే విదంగా కామన్ సర్వీస్ సెంటర్ ను ఎర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ మంచి కార్యక్రమానికి పూనుకున్నారు లక్ష్మణ్, చెర్లపల్లి డివిజన్ లోని సిల్వర్ ఓక్ బంగ్లా ముందున్న చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫీస్ లో పనిచేసే లక్ష్మణ్ ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) / (ఆధార్ సెంటర్) ను ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు శనివారము ఘనంగా ప్రారంభించారు. శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ .ఆన్ లైన్ లో చేసుకునే అన్ని సదుపాయాలు ఉంటాయని అన్నారు,
ఆధార్ కార్డు , పాన్ కార్డు, ఓటర్ ఐడి, బ్రాడ్ బ్యాండ్ రీఛార్జ్, డీ 2 హెచ్ రీఛార్జ్, కరెంట్ బిల్ కట్టే సదుపాయం మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకునే సదుపాయం, నల్లా బిల్లు కట్టే సదుపాయం, ట్రైన్ టికెట్స్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్ బుకింగ్ లు కులం సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్, నివాస ధృవకరణ పత్రం, ఆధార్ లో మార్పులు చేర్పులు, ఓటరు ఐ డి లో మార్పులు ఉద్యమ రిజిస్ట్రేషన్,ట్రేడ్ లైసెన్స్,షాప్ లైసెన్స్,కల్యాణ లక్ష్మి, షాదిముబారక్, పీ ఎఫ్, ఈ యస్ ఐ, డబ్బులు ట్రాన్స్ఫర్ లకు సంబంధించి తదితర సదుపాయాలు ఇక్కడ అందుబాటులొ ఉంటాయని ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో జక్కా రోషి రెడ్డి, బాల్ రెడ్డి, ప్రభు గౌడ్, నారెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పారిశ్రామిక వేత్తలు, తదితరులు పాల్గొన్నారు.