మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు
ఎల్బీనగర్: గ్రేట్ తెలంగాణ ప్రతినిధి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలను ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేటలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు చంపాపేటలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యాలయంలో మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ వేడుకలకు సేవాదళ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొన్నారు.