ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా కృషి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టు శాఖ మేనేజర్ పి.రాకేష్
హైదరాబాద్: ఫిబ్రవరి 16, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టు శాఖ కార్యాలయంలో బ్యాంకు ఖాతాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ పి.రాకేష్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలను ఖాతాదారులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బ్యాంకు అన్ని సేవలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఖాతాదారుల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేకంగా బాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది ఎం.రఘుకుమార్, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.