ఘనంగా జర్నలిస్టు దుర్గయ్య జన్మదిన వేడుకలు.
ఎల్బీనగర్: గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
సీనియర్ జర్నలిస్టు దుర్గయ్య జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహేశ్వరం నియోజకవర్గం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయ ప్రతినిధి గునగంటి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం దుర్గయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటేష్ గౌడ్ తీసుకొచ్చిన కేకును దుర్గయ్య కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుగా దుర్గయ్య ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. అంతకుముందు దుర్గయ్యను వెంకటేష్ గౌడ్, ఇతరులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అయితగోని శంకర్ గౌడ్, మహ్మద్ నజీర్ అహ్మద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.