రబ్బర్ ఫామ్ లో పడి యువకుడు మృతి..
లివొన్ ఫామ్ పరిశ్రమలో ఘటన…
కనీస సేఫ్టీ లేకుండా నడుపుతున్న పరిశ్రమ పై చర్యలు తీసుకోవాలనీ పలువురి స్థానికుల డిమాండ్
మనోహరబాద్.గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
ఎలాంటి సేఫ్టీ లు లేకుండా బయట రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులను అలుసుగా తీసుకొని వారి ప్రాణాలను బలి చేస్తున్న పరిశ్రమల పై చర్యలు తీసుకోవాలని పలువూరు డిమాండ్ చేస్తున్నారు..వివరాల ప్రకారం కల్లకల్ పారిశ్రామిక వాడలో గల లివాన్ ఫార్మ్ లో పని చేసే రాజస్థాన్ కి చెందిన కిషోర్ 22 అనే యువకుడు గత కొన్ని నెలలుగా పరిశ్రమలో పని చేస్తున్నాడు వీధిలో బాగంగా శుక్రవారం నాడు రబ్బర్ ఫార్మ్ శుద్ధి చేయడానికి పైకి ఎక్కి కాలు జారీ అందులో పారిపోవడం తో విషయం తెలుసుకున్న తోటి కార్మికులు సిబ్బంది సుమారుగా 20 నిమిషాల తరువాత డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో కార్మికుడు పడి ఉన్నాడు.వెంటనే ప్రయివేటు వాహనం లో మేడ్చల్ లో గల ఓ ఆసుపత్రికి తరలించిన ఉపయోగం లేకుండా పోయింది అప్పటికే కిషోర్ మరణించాడు అని తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.అక్కడ ఎలాంటి సేఫ్టీ లేకపోవడం కనీసం యజమానులు కూడా స్పందించక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు..ఈ ఘటన పై పలువరు మాట్లాడుతూ పొట్ట కుటి కోసం తల్లి తండ్రులు ఫ్యామిలీ నీ వదిలేసి ఇక్కడికి వస్తే వారినీ అదునుగా భావించిన పరిశ్రమ యాజమాన్యాలు తక్కువ జీతాలు ఇస్తు అధిక సమయం పని చేపించుకుంటు వారినీ సొమ్ము చేసుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు…
పత్తా లేని సేఫ్టీ అధికారులు.
కల్లకల్,కూచారం, ముప్పిరెడ్డిపల్లి,కొండాపూర్,పారిశ్రామిక వాడలో గత కొన్ని రోజులుగా ఎంతో మంది కార్మికులు కనీస ప్రథమ చికిత్స కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పత్రికల్లో వచ్చిన వార్తలను కొంతమంది అధికారులూ,యూనియన్ నాయకులు పరిశ్రమ యాజమాన్యం తో మాట్లాడి లక్షలు తింటున్నారు తప్ప చనిపోయిన వారి కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరిగేలా చేయడం లేదు దీనిపై సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు…