అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జెరిపేటి జైపాల్.
గ్రేట్ తెలంగాణ:మార్చి 07, (శేర్లింగంపల్లి ఇన్చార్జి):
ఆకాశంలో సగం మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని నిరంతరం శ్రమించే మహిళా శక్తినీ, యుక్తి, కఠోర దీక్షను, సేవా భావంను ఒక్క మహిళ దినోత్సవం రోజునే కాదు అను నిత్యం వారి సేవలను గుర్తించి వారిని గౌరవించాలని తెలంగాణ టీ.పి.సి.సి జనరల్ సెక్రెటరీ జెరిపెటి జైపాల్ అన్నారు. మహిళలు అన్నిరంగాల్లో మగ వాళ్ళతో పోటీ పడి పని చేస్తూ దేశ పురోగమించే దిశగా వారి పాత్ర ను పోషిస్తున్నారని అన్నారు. గురువారం చందానగర్ డివిజన్ శాంతి నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో సమాజహితం కోసం సేవాభావంతో పనిచేస్తున్న మహిళలను సమావేశ పరిచి ఈ సందర్భంగా వారు శాలువాలతో సత్కరించి సన్మానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్, పోచయ్య లు, సోషల్ మీడియా కన్వీనర్ కవి రాజ్ తలారి తదితరులు పాల్గొన్నారు.