Monday, December 23, 2024
Home Blog Page 4

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా వేంగల మధుసూదన్ నియామకం.

0

నియామక పత్రం అందజేసిన గంద మల్ల ఆనంద్ గౌడ్.

మేడ్చల్/ నాగారం, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

 

బీజేపీ ఓ బీ సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గంలోకి నాగారం పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, సుపీరియర్ లాబ్స్ అధినేత వెంగళ మధుసూదన్ కు నియామక పత్రం అందజేయడం జరిగింది,

బిజెపి సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, చిత్తశుద్దితో వ్యవహరిస్తు, సహచర కార్యకర్తలతో, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు, తమ ప్రాంతంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడముతో పాటు పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచి అన్ని వర్గాలలో పార్టీని మరింత విస్తరించడానికి తమ వంతుగా కృషి చేసున్ననందుకు సమాజం లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ అభివృద్ధికి అవసరమైన సేవలు చేస్తున్నందుకు గాను బిజేపి ఓ బీ సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఓ బీ సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు గంద మల్ల ఆనంద్ గౌడ్ బీజేపీ పార్టీ ఆఫీస్ లో నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎదిగిన శ్రీరాములు, వెంగళ మధుసూదన్ నేతలకు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంధ మల్ల ఆనంద్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు, ప్రధాన కార్యదర్శి శ్రీ నందనం దివాకర్, ప్రధాన కార్యదర్శి శ్రీ ఈశ్వరప్ప , ఉపాధ్యక్షులు శ్రీ సదానంద ముదిరాజు, రాష్ట్ర కార్యదర్శి గుండ్ల ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఈ బాధ్యతలు స్వీకరించడం జరిగింది,

వెంగల మధుసూదన్ మాట్లాడుతూ . ....

నా ఈ బాధ్యతలకు కారణమైన. ప్రతీ ఒక్కరికీ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి,ఉపాధ్యక్షులు సంజయ్ గణాటి, గొంగళ్ళ మహేష్, కాలేరు రామోజీ, బొడ్డు రవి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

0

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం : శతాబ్ది టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కాసు శ్రీనివాస్ రెడ్డి.

తలకొండ పల్లి గ్రేట్ తెలంగాణ న్యూస్.

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల పరిధిలోని లింగరావుపల్లి గ్రామానికి చెందిన చేన్నమోని జంగయ్య 24.08.2024 నాడు ఉదయం ఆకస్మికంగా మరణించడం జరిగింది, ఈ విషయం గ్రామానికి చెందిన నాయకుల ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు శతాబ్ది టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కాసు శ్రీనివాస రెడ్డి గారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 4000 రూపాయలు ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు పర్దేపురం యాదయ్య తన వంతు సహాయంగా 1000 రూపాయలు మొత్తంగా 5000 రూపాయలు మృతుడి కుటుంబానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్దేపురం యాదయ్య , బాలయ్య, శేఖర్, రామచంద్రయ్య, సైదులు, చెన్నకేశవులు తదితర గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

0

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

తలకొండపల్లి, గ్రేట్ తెలంగాణ న్యూస్.

ఈరోజు తలకొండపల్లి మండలంలోని లింగరావుపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ చేనమొని జంగయ్య మృతి చెందడం జరిగింది.ఈ విషయం టెకురి శివలింగం ద్వార తెల్సుకుని మృతుడి భార్య సత్యమ్మ కుటుంబానికి 3000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.కుటుంబానికి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజమొని అంజయ్య, బిక్షపతి, సత్యనారాయణరెడ్డి, కృష్ణయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఫేక్ బిల్లులు ఇచ్చి కోట్లల్లో బిజినెస్ దందా. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి…!?

1

వినాయక విగ్రహాలు తయారు చేసిన షెడ్ల మధ్య ఘర్షణ..

ఇరు వర్గాల మధ్య GST బిల్లు కోసం ఘర్షణ…

కేతేపల్లి ఆగస్టు 25, గ్రేట్ తెలంగాణ న్యూస్ ,

నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామం వద్ద వినాయక విగ్రహాలు తయారు చేసిన షెడ్లలో ఇరు వర్గాల మధ్యన భారీ ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలు దుర్భాషలాడుకొని గుద్దుకున్నారని స్థానికుల ఆరోపించారు.

ఈ విషయంపై నకిరేకల్ కేతపల్లి పోలీసులకు సమాచారం అందించగా ఇరు వర్గాల వారిని కేతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారని స్థానికులు తెలిపారు. వినాయక విగ్రహాలు అమ్మే సమయంలో జీఎస్టీ తో కూడిన బిల్లులు ఇవ్వకుండా మాన్యువల్ గా వారు తయారు చేసిన ఫేక్ బిల్లుల ఇచ్చి కోట్లల్లో ఈ బిజినెస్ దందా కొనసాగిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు తెలిపారు. ప్రభుత్వానికి రావలసిన జీఎస్టీ డబ్బులు ఎగ్గొట్టి ప్రభుత్వా ఆదాయానికి గండి కొట్టి జిఎస్టి బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వానికి ఎగనామం పెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు . దీని పై కొంతమంది స్థానిక అధికారులు బిజినెస్ దార్ల వద్ద కొంత ముడుపులు తీసుకొని చూసి చూడనట్లు గా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇనుపాముల గ్రామం నకిరేకల్ కు అతి సమీపంలో రోడ్డు వెంట వినాయక విగ్రహాల బిజినెస్ చేస్తున్న యాజమాన్యంపై స్థానిక అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆదాయాన్ని గండి పడకుండా ఖచ్చితమైన జీఎస్టీ తో కూడుకున్న బిల్లులతో వినాయక విగ్రహాల విక్రయాలు జరపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.వినాయక విగ్రహాల తయారీలో నానారకాల క్రేమికల్స్ సిమెంట్ సున్నం రసాయాలు వాడుతూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న వీరిపై పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ . జిల్లా ఎస్పీ స్పందించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే జీఎస్టీ బిల్లులు ఇక్కడ ప్రవేశపెట్టి వినాయక విగ్రహాల క్రయ విక్రయాలు జరపాలని నకరేకల్ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ విగ్రహాల తయారీ కొనసాగుతుందని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రభుత్వ ఆదాయం గండి కొట్టకుండా చూడాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గ్రేట్ తెలంగాణ  అక్షర గళం. 

0

గ్రేట్ తెలంగాణ 

  1. అక్షర గళం. 

నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుద్ది..

మనుషులకు బుద్ధి పనిచేయట్లేదా..!?

అబద్ధాలు చెప్పేటోళ్లు ఎక్కువైపోతున్నరు.!

కాసులకు కక్కుర్తి పడే వాళ్ళు తియ్యని మాటలు చెప్తారట…

గా మాటలు విని మోసపోయేటోల్లు మోసపోతూనే ఉన్నరు…

మన గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు మాట్లాడేటోళ్లను

జర ఓ కంట కనిపెట్టుండ్రి..

కడారి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్

విద్యుత్‌సౌధను ముట్టడించిన ఎస్సీ, ఎస్టీ ఇంజనీర్స్‌.

0

విద్యుత్‌సౌధను ముట్టడించిన ఎస్సీ, ఎస్టీ ఇంజనీర్స్‌.

రోస్టర్‌ విధానాన్ని అమలు చేయాలని.

టీఓఓ 954ను రద్దు చేయాలని డిమాండ్‌. 

హైదరాబాద్ గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

దశాబ్దాలుగా అమల్లో ఉన్న రోస్టర్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం బుధవారం విద్యుత్‌సౌధ ముందు ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యామ్‌మనోహార్‌, ప్రధాన కార్యదర్శి మేడి రమేష్‌లు మాట్లాడారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో గత ప్రభుత్వంలోని యాజమాన్యం ఎలాంటి జీఓలు లేనప్పటికీ దొడ్డిదారిన తీసుకొచ్చిన టీఓఓ 954, ఎన్‌ఓఓ 37, ఎస్‌పీఓఓ101, టీజీఓఓ 62లను వెంటనే రద్దు చేసి, ఉద్యోగులు సీనియార్టీ జాబితాను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌లో వచ్చిన పోస్టుల్లో సీనియార్టీని రోస్టర్‌ విధానంలో నిర్ణయించి ఇచ్చిన అడ్‌హాక్‌ ప్రమోషన్లను రెగ్యులరైజ్‌ చేసి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. అంతే కాకుండా కాన్‌సీక్వెన్సీయల్‌ సీనియారిటీని అమలు చేస్తూ ఉద్యోగులందరికీ ఇచ్చిన అడ్‌హక్‌ ప్రమోషన్లు రెగ్యులరైజ్‌ చేయాలని, రెండో శ్రేణి పౌరులుగా చూపబడుతున్న 23 వేల మంది ఆర్టిజన్లకు ఏపీబీఎస్‌ఈబీ రూల్స్‌ను వర్తింపజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ మనోహర్. స్టేట్ జనరల్ సెక్రెటరీ రమేష్ మేడి, నాంపల్లి. చంద్రయ్య. సోమ్లా నాయక్. వివిధ సంఘాల. వివిధ కంపెనీల ప్రతినిధులు నారాయణ నాయక్. నాగరాజు. ఆనంద్ బాబు. బీచ్ పెళ్లి. ఆనందం. కుమారస్వామి. సత్యనారాయణ. శరత్ బంద. రవీందర్. కృష్ణ. వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరన రాజ్యాంగ విరుద్ధం: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జీ.చెన్నయ్య.

0

వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం: జాతీయ మాలల ఐక్య వేదిక తెలంగాణ అధ్యక్షులు కరణం కిషన్.

*ఎస్సీ వర్గీకరన రాజ్యాంగ విరుద్ధం: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జీ.చెన్నయ్య.* 

హైదరాబాద్ గ్రేట్ తెలంగాణ న్యూస్:

వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని జాతీయ మాలల ఐక్య వేదిక తెలంగాణ అధ్యక్షుడు కరణం కిషన్ అన్నారు, భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలలు,

మాల మహానాడు కార్యకర్తలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహాం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరణం కిషన్ మీడియాతో మాట్లాడుతూ,

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని

అన్నారు. వర్గీకరణ పై తీర్పు నిచ్చే అధికారం సుప్రీం కోర్టుకు లేదని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జీ చెన్నయ్య మాట్లాడుతూ, ఎస్సి వర్గీకరణ రాజ్యాంగ విరుద్దం అని, ఆర్టికల్ 341కు వ్యతిరేకమని ఆయన అన్నారు.

దేశంలోని అన్ని ఎస్సీ ఎస్టీ సంఘాలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి బహుజన సమాజ్ పార్టీ మాయావతి గారు లోక్ జనశక్తి పార్టీ కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్ గారు రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు మాల మహానాడు మాల సంఘాల జేఏసీ ఎస్సీ వర్గీక న వ్యతిరేక పోరాట సమితి అలాగే ఉత్తర భారత దేశంలోని మాదిగలంతా ఎస్సీ వర్గీకరనను వ్యతిరేకిస్తున్నారని చెన్నయ్య పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంజాబ్ హైకోర్టు ఐదుగురు జడ్జిల్లా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ ఆర్టికల్స్ ప్రకారమైతే వర్గీకరణ చల్లదని చెప్పాయో అవే ఆర్టికల్స్ ప్రకారం ఇప్పుడు వర్గీకరణ చేయొచ్చని చెప్పడం విడ్డూరం అన్నారు రాజ్యాంగ సవరణ జరగకుండా ఆర్టికల్స్ మార్చకుండా వర్గీకరణ చేయాలని చెప్పడం కరెక్ట్ కాదన్నారు సుప్రీంకోర్టు తీర్పు క్రిమిలేయర్ను అమలు చేయాలని చెబితే దాన్ని అమలు చేయమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయకపోవడం తన ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు వెంటనే ఎస్సీ వర్గీకరణను క్రిమిలేయర్ ను ఉపసంహరించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కరణం కిషన్, గోపోజి రమేష్ బాబు, మన్నె శ్రీధర్ రావు, బూర్గుల వెంకటేశ్వర్లు, భాను ప్రకాష్, తాలూకా రాజేష్, బండి ఆనంద్ రావు, గోకుల్, కళ్యాణ్ బైండ్ల శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్, చల్ల పవన్, బుద్ధిష్టి సొసైటీ రత్నం సురేష్, లలిత, స్వరూప, రాణి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి.

0

రోడ్డు ప్రమాదంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి.

తుంగతుర్తి ఆగస్టు 21 గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

రోడ్డు ప్రమాదంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన బుధవారం వేములపల్లి మండలంలోని భీమవరం సూర్యాపేట రహదారిపై పచ్చర్గడ్డ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన జలగం రాములు( 53) సూర్యాపేట నుండి మిర్యాలగూడ వెళ్తుండగా యూరియా లోడుతో సూర్యాపేట వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.విజయ్ కుమార్ తెలిపారు.

పంచాయతీ ఎన్నికలు.. ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ ఖరార్..!

0

*పంచాయతీ ఎన్నికలు.. ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ ఖరార్..!!*

హైదరాబాద్‌: గ్రేట్ తెలంగాణ న్యూస్.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

సెప్టెంబర్‌ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. జాబితాపై సెప్టెంబర్‌ 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురిస్తారు. ఈ మేరకు ఓటరు జాబితా తయారీపై ఈనెల 29న కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

దగా కోరు కెసిఆర్ కు కష్టజీవుల బిడ్డ తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు బహిరంగ లేఖ.

0

దగా కోరు కెసిఆర్ కు కష్టజీవుల బిడ్డ తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు బహిరంగ లేఖ.

హైదరాబాద్ గ్రేట్ తెలంగాణ న్యూస్.

ఏమి సాధించారు మిత్రమా.! ఎక్కడ మొదలై ఎలా ముగిసింది నీ ప్రస్థానం..!

చింతమడక, సిద్దిపేటను దాటి సింగపూర్ లు స్విస్ బ్యాంకులంటూ పరుగెత్తిన మీ ప్రయాణం మళ్ళీ మూలానికే కదా వచ్చింది.ఏవీ ఆ మంగళ వాయిద్యాలు, ఏవీ ఆ నీరాజనాలు, ఏవీ ఆ రాజభోగాలు.మీ అడుగులకు మడుగులొత్తే మంది మాగధులేరి…? మీరేం చెప్పినా వహ్వాలు పలికే విదూషకులేమైరి..?

కళ్ళముందే కూలిపోయిన స్వప్నాలు, కన్ను పొడుచుకున్నా కానరాని వెలుతురు..! ఎలా జీర్ణించుకుంటున్నావు అవినీతి అనే పాము నోట్లో తలపెట్టినప్పుడు ఊహించి ఉండవు కదా అది నిన్ను మింగేస్తుందని అంతులేని ప్రజల ప్రేమాభిమానాలకంటే అత్యంత విషపూరితమైన కట్లపాములాంటి నోట్లకట్టలపైకి నీకు మనసెలా పోయింది,ఈమధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టు లేదు, గతించిపోయిన మీ గతాన్ని తవ్వుతున్నట్టు అధికారాంతమున చూడవలె అయ్యగారి లీలలు”అన్నట్టుగా నీ మొహంలో ఆ ముందు కాంతులేవి ఇప్పుడే ఆ హితులు స్నేహితులు ఎక్కడ, కొందరప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరున పెట్టిన ఆస్తిపాస్తులను తిరిగివ్వటానికి మనసొప్పక వాటిని చక్కదిద్దుకునే పనిలో పడటం, మరికొందరు వారు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకోవాలని యోచించటం ఇది కదా అసలైన జీవిత సత్యం. అధికారంలో ఉండి కూడబెట్టిన వేల ఎకరాల భూములకన్నా స్వగ్రామంలో మీ స్వార్జితం ఎనిమిది ఎకరాలేంటో విలువగా తోయటం లేదా ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ నేను నా ముసల్ది మాత్రమే ఉన్నాం.. నా ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిలయ్యారు..నాకే స్వార్ధం లేదు, నాకు ఏ పదవులు వద్దు నేను తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నమ్మి నాయకుణ్ణి చేసారు…! దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తాను” అని చెప్తే నమ్మిన బడుగుజీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేసారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా.ఈ దగా కు ఏం పేరు పెడతారు, వారి త్యాగాలను ఏ త్రాసుతో కొలుస్తారు..?

స్వరాష్ట్రం కోసం, ఒక మానవీయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదురెళ్లిన యువతరం తెగింపు..చావును ముద్దాడిన వారి త్యాగఫలం కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు అంతులేని మీ ధనదాహం ముందు నిరుద్యోగ యువత ఆక్రందనలు వినిపించలేదా, పౌర హక్కులు కనిపించలేదా?

*అంత నిరంకుశమేల మిత్రమా…?* 

బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేకమేడ ఎన్నల్లుంటుంది ఎప్పుడైనా కూలిపోవాల్సిందే,పులి రాజాగా ఉద్యమంలో ముందుకు పోతూ మీ పంజా కింద నలిపేసిన లేళ్ళు, దుప్పిలు, కుందేళ్ల మాటేమిటి మిత్రమా.మీరిప్పుడు కట్టుకున్న బంగళాలు, పోగేసుకున్న సంపద ఏది మీ ప్రతిష్టను తిరిగి తీసుకురాలేదు కదా…!మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడు ఉండగా ఇరుకైన పాలరాతి మేడలెందుకు  మనసుల్లో కొలువై ఉంటే మహా భాగ్యాన్ని వదులుకొని భోగభాగ్యాల వెంట పరుగులెందుకు. జనం ఆదరణ కోల్పోయి సంపాదించేవి రత్నాలైనా రాళ్ళతో సమానమే కదా  ఎత్తులు వేయటంలో, వ్యూహాలు రచించటంలో కనుచూపు మేర మీకు సరిజోడు అయిన నాయకుడున్నాడా.  ఆ రాజనీతిజ్ఞత, దర్శనికత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ళ గుండెల్లో ఉండిపోయేవాళ్ళు కదా. ఎందుకొచ్చిన మాయదారి సంపద.. ఏం చేసుకోను.?  మీ ముందు తరాలను సోమరులను చేయటానికి కాకపొతే మీరు పోగేసుకున్న సంపదలో అర శాతం కూడా మీ జీవితకాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకొచ్చిన ఆరాటం. ఆ సంపద పోగేసుకునేలా మీ ప్రతినాయకుణ్ణి మీరే సృష్టించుకోవటం, మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవటమే కదా వైచిత్రి అంటే. సైజు పెద్దదిఅయిన అంగీల అలవాటు లేని అపోజిషన్ లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే గాని అయ్యో అనేవాళ్ళు లేకపోవటం ఎంత దుర్భరం మిత్రమా…!

ఉద్యమంలో మీరు చేసిన బసలు అధికారంలో ఉన్నాయి మీ శత్రువు ఆచరిస్తున్నాడు… గమనించారా..?ప్రజాస్వామ్యంలో అధికార క్రతువును నిర్వహించడం ఎలాగో అతని నుంచైనా మీరు నేర్చుకుంటారా. ఓటమి ఎప్పుడూ చివరి మజిలీ కాదు, అదెప్పుడూ తాత్కాలికమే..!కానీ ఓటమి.. గెలుపుగా మారాలంటే అన్నీ ఒదులుకొని మళ్ళీ బయలుదేరిన చోటుకి రావాలి అని కష్టజీవుల బిడ్డ… బాధితుల బంధువు…. సామాజిక పరివర్తకుడు, ప్రజా ఉద్యమాల శ్రేయోభిలాషి … ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎం ఎల్ సెక్రటరీ….కామ్రేడ్ జె కె ఆర్ గారి జె ఎస్ ఆర్ కోరారు.