చెన్నైలోని భారతీయ విద్యాభవన్ లో ప్రధానం.
మహమ్మదాబాద్, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
మహబూబ్ నగర్ లో న్యాయవాది, పరిగి, మహ్మదాబాద్ లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో సేవలు అందించిన ఎర్రవల్ల రాములు కు సామాజిక సేవా కార్యక్రమాల విభాగం కింద సోషల్ సర్వీస్ లో గౌరవ డాక్టరేట్ అవార్డు దక్కింది. ఆదివారం చెన్నై నగరం లోని భారతీయ విద్యా భవన్ లో జరిగిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎర్రవళ్ళ రాములుకు అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ చైర్మన్ మానుయేల్, రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సంపత్ కుమార్, రిటైర్డ్ జడ్జి వెంకటాచం, డాక్టర్ వాళ్లర్మతి, ప్రొఫెసర్ రజిని, పలువురు ప్రముఖులు అతిథులు గా హాజరయ్యారు. అవార్డు అందుకున్న రాములు కు పలువురు అభినందనలు తెలిపారు.