ఎంపి ఈటెల రాజేందర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంగల మధుసూదన్.
వెంగల మధుసూదన్ ను అభినందించిన ఈటెల రాజేందర్.
మేడ్చల్/ నాగారం, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
నాగారం పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, సుపీరియర్ లాబ్స్ అధినేత వెంగళ మధుసూదన్ ను బీజేపీ ఓ బీ సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా నియమించినందుకు గాను బుదవారం ఈటెల రాజేందర్ గారిని మర్యాద పూర్వకంగా తన నివాసంలో కలుసుకోని కృతఙ్ఞతలు తెలియజేయడం జరిగింది,
వెంగళ మధుసూదన్ మాట్లాడుతూ…
బీజేపీ సిద్దాంతం, ఆదర్శాలకు అంకితమై నీతి, నిజాయితీ నిబద్దత, క్రమశిక్షణ చిత్త శుద్ధితో వ్యవహరిస్తూ సహచర కరుకర్తలతో పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త ఎదుగుదలకు కృషి చేస్తానని వేంగల మధుసూదన్ తెలిపారు, ఈ పదవి మరింత బాధ్యతను పెంచిందని తనపై ఎంతో నమ్మకం ఉంచి ఎంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు, నాకు అన్నివిధాల సహాయ సహకారాలు అందించి నా ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు, తమ ప్రాంతంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడముతో పాటు పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచి అన్ని వర్గాలలో పార్టీని మరింత విస్తరించడానికి తమ వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో ఎంపి ఈటెల రాజేందర్ గారు, నాగారం మునిసిపల్ ఛైర్మెన్ చంద్రారెడ్డి, సతీష్ సాగర్ పుందరికం తదితరులు పాల్గొన్నారు.