మానవత్వం చాటుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
నకిరేకల్ గ్రేట్ తెలంగాణ న్యూస్.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన పర్యటనలో భాగంగా సోమవారం నాడు నార్కెట్‌పల్లి నుండి అమ్మనబోల్ వెళ్తున్న క్రమంలో అక్కనపల్లి గ్రామ శివారులో ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రం పైన ప్రయాణిస్తున్న మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను గమనించిన ఎమ్మెల్యే వేముల వీరేశం హుటాహుటిన తన కన్వాయిని ఆపి తన కన్వాయిలోని ఓ వాహనంలో క్షతగాత్రున్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రజలు , క్షతగాత్రుని కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల లకు కృతజ్ఞతలు తెలిపారు.