నకిరేకల్ ఆగస్టు 30 (గ్రేట్ తెలంగాణ)
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన కల్లేపల్లి హిరణ్య శ్రీ( 2 సం.) చిన్నారికి కిడ్నీ వద్ద గడ్డతో బాధపడుతూ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్సకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు.. అలాగే సెప్టెంబర్ 5 వ తారీఖున హాస్పిటల్లో ఆపరేషన్ ఉంది డాక్టర్లు 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని తెలుపగా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన పూర్ణ తమ్ముడు ప్రాణ దాతలు ఫౌండేషన్ నీ సంప్రదించగా వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడి నిజ నిర్ధారణ చేసుకొని గత రెండు రోజులుగా ఫండింగ్ చేయగా జమ అయిన మొత్తం సహాయం అక్షరాల 20500/- రూపాయలు రిటైర్డ్ ఆర్మీ మలే సతీష్ రెడ్డి అన్న దంపతులు చేతుల మీదుగా ఆర్ధిక సహాయం వారికి అందించడం జరిగింది కావునా చిన్నారి హిరణ్య శ్రీ కోసం సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కార్యక్రమములో వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్, న్యూస్ 18 రిపోర్టర్ బెల్లి శంకర్, పాలెం సర్పంచ్ విజయ్ కుమార్, విక్కీ తదితరులు పాల్గొన్నారు…