Monday, December 23, 2024
Home Blog Page 2

ఘనంగా జాతీయ ఇంజనీర్ల దినోత్సవం.

0

 

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి.

సరూర్ నగర్ గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భముగా రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లో ఉన్న అమ్మ జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చదువుకుంటున్న విద్యార్థులకు jntu విద్యార్థి నాయకులు ఆమన్ గల్ రాజు తన వంతుగా సహాయం చేయడం జరిగింది , ఈ సందర్బంగా ఆమనగల్ రాజు మాట్లాడుతూ సర్ విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో భవిష్యత్ లో కీలక ఇంజనీర్లుగా తయారు అయ్యి దేశ భవిష్యత్ లో ఇంజినీర్ల పాత్ర కీలకంగా ఉండాలని పేర్కొన్నారు, ప్రపంచ పటంలో ఇంజనీర్ల శక్తి నీ చాటి చెప్పిన ఘనత కేవలం విశ్వేశ్వరయ్యకే దక్కిందని తెలిపారు అందుకే సెప్టెంబర్ 15 తేది రోజు కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీర్ల దినోత్సవం జరుపుకుంటారు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అమ్మ జ్యోతి ఫౌండేషన్ వ్యస్థాపకులు భద్రయ్య ,విద్యార్థి నాయకులు కిషన్, విద్యార్థులు పాల్గొన్నారు.

డా. కొప్పుల విజయ్ కుమార్ కు అరుదైన గౌరవం

0

 

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ” లో చోటు దక్కించుకున్న కొప్పుల విజయ్ కుమార్. 

శంకర్‌పల్లి: సెప్టెంబర్ 14: (గ్రేట్ తెలంగాణ) :

సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మెన్ డా. కొప్పుల విజయ్ కుమార్ కు ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. శనివారం సెప్టెంబర్ 14 వ తేదిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో, బెంగుళూరులోని సేవా సదన్ ఆడిటోరియంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రియాలిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చైర్మన్ డా. రాబర్ట్ ఇమ్మన్యుయేల్, డిప్యుటీ చైర్మన్ డా. శ్రీనివాస్, ప్రెసిడెంట్, డా. ఏ. పి. శ్రీనాథ్, ఇంటర్నేషనల్ టెక్నీకల్ ఆఫీసర్ అనంతన్ కుపుసామి, డైరెక్టర్ డా. ఆర్. సెల్వం చేతుల మీదుగా అత్యంత విలువైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ను డా. కొప్పుల విజయ్ కుమార్ అందుకున్నారు. ఈ సందర్బంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ రియాలిటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ, న్యూఢిల్లీ వారి ద్వారా సెప్టెంబర్ 14 న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ” వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ” తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను చేసిన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, న్యాయ సేవా కార్యక్రమాలు చేసినందుకు గుర్తించి 16 దేశాల కమిటీ సభ్యుల ద్వారా తనను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇంతటి గొప్ప అవార్డు రావడానికి తానకు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, భాదలు ఎదురైనా, వాటిని తట్టుకొని నిలబడి, సామాజిక, న్యాయ సేవల్లో అలుపెరగని పోరాటం చేయడమే ఇందుకు కారణం అన్నారు. మనము చేసే మంచి పనులే మనకు మార్గదర్శకాలు అని అన్నారు. నా వెంట కష్ట, సుఖాల్లో తోడుగా ఉన్న నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ, నాన్నలు ప్రోత్సాహం, సహకారం చాలా ఉందని అన్నారు. ఈ అవకాశం రావడానికి సహకరించిన న్యాయ విభాగం మిత్రులకు, అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

భువనగిరి ముద్దుబిడ్డ కీ,,శే,, జిట్టా బాలకృష్ణ రెడ్డి సంతాప సభ.

0

 

భువనగిరి, గ్రేట్ తెలంగాణ న్యూస్.

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు భువనగిరి ముద్దుబిడ్డ కీ,,శే,, జిట్టా బాలకృష్ణ రెడ్డి గారి” సంతాప సభ తేదీ :15-09-2024 ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుండి భువనగిరి పట్టణంలో జరుగును..

తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు డా,, చెరుకు సుధాకరన్న పిలుపు మేరకు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్న ఉద్యమకారులు, మొదటి నుండి TRS పార్టీలో పని చేసిన నాయకులు, వివిధ పార్టీలల్లో ఉన్న ఉద్యమకారులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు అందరూ తప్పక హాజరు అయ్యి బాలకృష్ణ రెడ్డి అన్నకు నివాళులు అర్పించాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోరాటాల రామన్న తెలిపారు.

ఎమ్మెల్యే లా వీధి రౌడీలా….?

0

  తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కమిటి వర్కింగ్  ప్రెసిడెంట్ రామన్న మాదిగ.

పరిగి, గ్రేట్ తెలంగాణ న్యూస్.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కౌశిక్ రెడ్డిని అరికేపూడి గాంధీని వెంటనే సస్పెండ్ చేసి ఏ ఇతర పార్టీ కూడా వీరికి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి టికెట్ ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రామన్న మాదిగ హెచ్చరించారు, కౌశిక్ రెడ్డి తీరుపై బీ ఆర్ యస్ పార్టీకి నష్టం జరిగేలా వుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు గత తెలంగాణ ఉద్యమాల్లో ఉద్యమ కారులపై తుపాకి ఎక్కు పెట్టిన వాడే కౌశిక్ రెడ్డి, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజా సమ్యలను గాలికి వదిలి పార్టీల మద్య చిచ్చులు పెట్టడం ఏంటి అని తెలంగాణ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు అని అన్నారు, సరైన సమయంలో ఓట్లతో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ ఉద్యమ వేదిక ఒక ప్రకటనలో పేర్కొంది.

2024 -25 సంవత్సరానికి గాను స్టూడెంట్ కౌన్సిల్ లో జరిగిన ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కడారి నిత్యశ్రీ.

0

 

గ్రేట్ తెలంగాణ న్యూస్ పార్షిగుట్ట :-

2024 25 సంవత్సరానికి గాను స్టూడెంట్ కౌన్సిల్ లో జరిగిన ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైంది కడారి నిత్యశ్రీ. తన తండ్రి కడారి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ గా గ్రేట్ తెలంగాణ న్యూస్ తో మాట్లాడుతూ..నా కూతురుకు ఇంతటి గొప్ప స్థానం కల్పించిన కాలేజీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కడారి నిత్యశ్రీ కి తన తోటి విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు. బి ఎ ఎకనామిక్స్ లో తనదైన ముద్ర వేసుకొని చదువులో బి ఎ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తను ఉన్నతంగా ఎదగాలని కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ మిగతా లెక్చరర్లు కడారి నిత్యశ్రీని ఆశీర్వదించారు. కడారి నిత్యశ్రీ మీడియాతో మాట్లాడుతూ నాకు ఈ అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని, అలాగే బరువు బాధ్యతలు కూడా ఉన్నాయని జీవితంలో ఇలాంటి అవకాశం రావడం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చిన పరిష్కరించుకునే ఒక దృఢమైన శక్తి చదువుకునే సమయంలోనే కలుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలేజీ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

యూటీఎఫ్ మండల అధ్యక్షుడిగా రాగి రాకేష్ కుమార్.

0

 

శాలి 0గౌరారం సెప్టెంబర్ 11 (గ్రేట్ తెలంగాణ)

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శాలిగౌరారం మండల అధ్యక్షుడిగా రాగి రాకేష్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా కాడేరు రవికుమార్ ఉపాధ్యక్షులుగా చింతిరాల పురుషోత్తం మన్నె దేవయాని కోశాధికారి కార్యదర్శులు కిషోర్ మల్లేష్ లింగయ్య భగత్ నవజాత మహిళా కన్వీనర్ మానస సోషల్ మీడియా కన్వీనర్ ఎం చంద్రశేఖర్ క్రీడా కన్వీనర్ సిహెచ్ జ్యోతి పత్రిక కన్వీనర్ ఎస్ కే అల్లావుద్దీన్ అకాడమిక్ కన్వీనర్ వీ నాగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పరిశీలకులుగా జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు అధికారిగా జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్ రెడ్డి వ్యవహరించారు అనంతరం రాగి రాకేష్ కుమార్ మాట్లాడుతూ. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డి ఏ లను తక్షణమే విడుదల చేయాలని పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని మోడల్ స్కూల్ కేజీబీవీ లల్లో తక్షణమే బదిలీలు ప్రమోషన్లు నిర్వహించాలని అన్నారు సహకరించిన ఒకరికి ధన్యవాదాలు తెలిపారు.

దిట్టకవి గ్యాస్ కన్వర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులో ఘనంగా వినాయక చవితి వేడుకలు.

0

అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరావు. 

నాగోల్ సెప్టెంబర్ 11.గ్రేట్ తెలంగాణ ప్రతినిధి .

బుదవారం దిట్టకవి గ్యాస్ కన్వర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వర్క్ షాప్ లో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది, దిట్టకవి గ్యాస్ కన్వర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వాసుదేవరావు మాట్లాడుతూ ………

ప్రతిసారి వినాయకుడిని ఆఫీసులో ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరు ఎలాంటి విఘ్నాలు లేకుండా వినాయక చవితి జరుపుకోవాలని కులమతాలకు అతీతంగా ఈ వినాయక నిమజ్జనం జరగాలని అన్నారు, ఈరోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పలువురికి అన్నదానం చేసిన ఆయన వినాయకుడు అంటే విజ్ఞాలు లేకుండా చూసేవాడని భక్తి శ్రద్ధలతో వినాయకుడినీ పూజించి ఏది కోరుకుంటే అది జరుగుతుందని అన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వాసుదేవరావు మాట్లాడుతూ, యువత ఐకమత్యంగా కలిసి వినాయక చవితి వేడుకలను జరిపించడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని, బాల గంగాధర్ తిలక్ చూపిన దారిలో యువత నడవడం ఎంతో ఆనందంగా ఉందని అయన అన్నారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ పాలనలో ఈ వేడుకలకు ప్రాముఖ్యతను సంతరించుకుందని, తర్వాత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో దేశంలో అందరినీ ఒక్కటిగా చేసేటందుకు బాల గంగాధర్ తిలక్ గణపతి ఉత్సవం, శివాజీ ఉత్సవాలను ప్రారంభించారని, భారతీయుల పూజా మందిరాలలో జరిగే గణేష్ పూజలు, సామూహిక పూజలు సామాజికమైన, సార్వజనీకమైన ప్రాధాన్యతను అందించేందుకు తిలక్ చేసిన కృషి అనన్య సామాన్యం అనీ తలచిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా దిగ్విజయంగా పనులు పూర్తి కావాలంటే ఆ గణనాయకుడిని పూజిస్తే చాలు అని అన్నారు . ఈ రోజు ప్రజలకు అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అన్ని చట్టాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు శిక్షణా కార్యక్రమం.

0

ప్రైవేట్ హెల్త్‌కేర్ నిపుణులు చట్టపరమైన, నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి: డా. టి. రఘునాథ్ స్వామి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మేడ్చల్ మల్కాజ్ గిరి.

మేడ్చల్ సెప్టెంబర్ 11,  గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన సూచనల మేరకు బుదవారం సి.ఎం.ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌, కండ్లకోయలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో డా. టి. రఘునాథ్ స్వామి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం, ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) చట్టం, గర్భం యొక్క వైద్య రద్దు (MTP) చట్టం, సరోగసీ చట్టం, ఆయుష్మాన్ భారత్ యొక్క అమలు. వెక్టర్-బోర్న్ & కమ్యూనికేబుల్ డిసీజెస్, రొటీన్ ఇమ్యునైజేషన్ మరియు చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అన్ని చట్టాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రోగ్రామ్ అధికారులతో మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని ప్రైవేట్ హాస్పిటల్స్ & డయాగ్నస్టిక్ సెంటర్‌ల మేనేజింగ్ మరియు మెడికల్ డైరెక్టర్లు, గైనకాలజిస్ట్, రేడియాలజిస్టులు మరియు పాథాలజిస్టులకు & పర్యవేక్షణపై ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

సి.ఎం.ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌, కండ్లకోయలో శిక్షణ నిర్వహించబడింది. ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు వారిని ఉద్దేశించి డా: రఘునాథ్ స్వామి మాట్లాడుతూ.. ….

ప్రైవేట్ హెల్త్‌కేర్ నిపుణులు పూర్తి సమాచారం మరియు చట్టపరమైన మరియు నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా ఈ శిక్షణలు అవసరమని అన్నారు. ఈ సెషన్‌లు రోగి హక్కులను పరిరక్షించడానికి, నైతిక వైద్య విధానాలను నిర్ధారించడానికి మరియు ప్రజారోగ్య ప్రమాణాలను నిర్వహించడానికి రూపొందించబడిన ముఖ్యమైన ఆరోగ్య చట్టాలను ఎలా అమలు చేయాలి మరియు పర్యవేక్షించాలి అనే దానిపై క్లిష్టమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. ఈ శిక్షణలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో విధానాలను ప్రామాణీకరించడానికి, సంరక్షణ నాణ్యతలో ఏకరూపతను నిర్ధారించడానికి మరియు ఆడిట్‌లు మరియు తనిఖీలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలను సిద్ధం చేయడంలో సహాయపడతాయని తెలిపారు .

వినాయక విగ్రహాలకు ఆటంకం కలగకుండా చెట్ల కొమ్మలను తోలగింప చేస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాస్.

0

 

కాచిగూడ గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

వినాయక చవితి సందర్భంగా కాచిగూడ ఏరియాలో ఏర్పాటు చేస్తున్న వినాయక విగ్రహాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పై అధికారుల ఆదేశాల మేరకు బర్కత్పుర రాఘవేంద్ర స్వామీ మఠం లేన్ లోని అతి పెద్దగా ఉన్న రావి చెట్టు కొమ్మలను కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, కాచిగూడ లా & ఆర్డర్ అడ్మిన్ ఏస్.ఐ సుభాష్ గ్రేటర్ హైదరబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది తో కలిసి అడ్డుగా ఉన్న చెట్లు కొమ్మలను తొలగింప చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు సిబ్బంది గ్రేటర్ హైదరబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి. దైద రవీందర్

0

 

నకిరేకల్ గ్రేట్ తెలంగాణ న్యూస్.

నకిరేకల్ నియోజకవర్గం గత రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నకిరేకల్ పట్టణంలోని వడ్డెర బస్తీ,ఎస్సీ కాలనీ,మొండివారి కాలనీ లలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద రవీందర్ పర్యటించారు.. అక్కడ ఉన్న ప్రజలతో కలిసి మాట్లాడారు..భారీ వర్షాల నేపథ్యంలో ఎవరూ కూడా బయటకు రావద్దనీ.వరద నీరు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో దోమలు ప్రబలకుండా శానిటేషన్ చేయాలని అధికారులకు సూచించారు గుబురుగా ఉన్న చెట్ల వల్ల విషపురుగులు ఇళ్లలోకి రాకుండా వాటిని తొలగించాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ప్రజలు ధైర్యంగా ఉండాలని కరెంట్ స్తంభాలను ముట్టుకోవద్దని సూచించారు.. వర్షాలకు దెబ్బతిన్న వీధి లైట్లని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.

ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆత్మస్థైర్యం కొల్పోకూడదని కోరారు .అత్యవసర సమయాల్లో నన్ను గాని కార్యకర్తలను,మరియు మున్సిపల్ అధికారులను సంప్రదించవచ్చని కోరారు..