అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరావు.
నాగోల్ సెప్టెంబర్ 11.గ్రేట్ తెలంగాణ ప్రతినిధి .
బుదవారం దిట్టకవి గ్యాస్ కన్వర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వర్క్ షాప్ లో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది, దిట్టకవి గ్యాస్ కన్వర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వాసుదేవరావు మాట్లాడుతూ ………
ప్రతిసారి వినాయకుడిని ఆఫీసులో ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరు ఎలాంటి విఘ్నాలు లేకుండా వినాయక చవితి జరుపుకోవాలని కులమతాలకు అతీతంగా ఈ వినాయక నిమజ్జనం జరగాలని అన్నారు, ఈరోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పలువురికి అన్నదానం చేసిన ఆయన వినాయకుడు అంటే విజ్ఞాలు లేకుండా చూసేవాడని భక్తి శ్రద్ధలతో వినాయకుడినీ పూజించి ఏది కోరుకుంటే అది జరుగుతుందని అన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వాసుదేవరావు మాట్లాడుతూ, యువత ఐకమత్యంగా కలిసి వినాయక చవితి వేడుకలను జరిపించడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని, బాల గంగాధర్ తిలక్ చూపిన దారిలో యువత నడవడం ఎంతో ఆనందంగా ఉందని అయన అన్నారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ పాలనలో ఈ వేడుకలకు ప్రాముఖ్యతను సంతరించుకుందని, తర్వాత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో దేశంలో అందరినీ ఒక్కటిగా చేసేటందుకు బాల గంగాధర్ తిలక్ గణపతి ఉత్సవం, శివాజీ ఉత్సవాలను ప్రారంభించారని, భారతీయుల పూజా మందిరాలలో జరిగే గణేష్ పూజలు, సామూహిక పూజలు సామాజికమైన, సార్వజనీకమైన ప్రాధాన్యతను అందించేందుకు తిలక్ చేసిన కృషి అనన్య సామాన్యం అనీ తలచిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా దిగ్విజయంగా పనులు పూర్తి కావాలంటే ఆ గణనాయకుడిని పూజిస్తే చాలు అని అన్నారు . ఈ రోజు ప్రజలకు అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.