“వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ” లో చోటు దక్కించుకున్న కొప్పుల విజయ్ కుమార్.
శంకర్‌పల్లి: సెప్టెంబర్ 14: (గ్రేట్ తెలంగాణ) :
సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మెన్ డా. కొప్పుల విజయ్ కుమార్ కు ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. శనివారం సెప్టెంబర్ 14 వ తేదిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో, బెంగుళూరులోని సేవా సదన్ ఆడిటోరియంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రియాలిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చైర్మన్ డా. రాబర్ట్ ఇమ్మన్యుయేల్, డిప్యుటీ చైర్మన్ డా. శ్రీనివాస్, ప్రెసిడెంట్, డా. ఏ. పి. శ్రీనాథ్, ఇంటర్నేషనల్ టెక్నీకల్ ఆఫీసర్ అనంతన్ కుపుసామి, డైరెక్టర్ డా. ఆర్. సెల్వం చేతుల మీదుగా అత్యంత విలువైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ను డా. కొప్పుల విజయ్ కుమార్ అందుకున్నారు. ఈ సందర్బంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ రియాలిటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ, న్యూఢిల్లీ వారి ద్వారా సెప్టెంబర్ 14 న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ” వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ” తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను చేసిన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, న్యాయ సేవా కార్యక్రమాలు చేసినందుకు గుర్తించి 16 దేశాల కమిటీ సభ్యుల ద్వారా తనను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇంతటి గొప్ప అవార్డు రావడానికి తానకు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, భాదలు ఎదురైనా, వాటిని తట్టుకొని నిలబడి, సామాజిక, న్యాయ సేవల్లో అలుపెరగని పోరాటం చేయడమే ఇందుకు కారణం అన్నారు. మనము చేసే మంచి పనులే మనకు మార్గదర్శకాలు అని అన్నారు. నా వెంట కష్ట, సుఖాల్లో తోడుగా ఉన్న నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ, నాన్నలు ప్రోత్సాహం, సహకారం చాలా ఉందని అన్నారు. ఈ అవకాశం రావడానికి సహకరించిన న్యాయ విభాగం మిత్రులకు, అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.