Monday, December 23, 2024

నకిరేకల్ నియోజకవర్గంలో భారీ వర్షాలు.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి – దైద రవీందర్.

నకిరేకల్ గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు. రైతులు వ్యవసాయ క్షేత్రానికి పోయినప్పుడు మోటార్లు , స్టాటర్లు , జయింట్లు ఉన్న కరెంటు తీగలు తాకొద్దు , వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఉండొద్దు పాత ఇండ్లు , శిథిలావస్థలో ఉన్న మట్టి మిద్దెల లో నివసిస్తున్న వారు సురక్షితమైన ఇండ్లలోకి పోవాలి . గ్రామాల్లో పిల్లలు చెరువులు , వాగుల వద్దకు వెళ్లకుండా పెద్దవారు చర్యలు తీసుకోవాలి . కాలనీల్లో ఉన్న కరెంటు స్తంభాలు , తీగలు ఎవరు తాకొద్దు సీజనల్ వ్యాధులు రాకుండా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి నిల్వ ఉంచిన నీటిని ఉపయోగించవద్దు. వరద నీరు రోడ్డు మీద ప్రవహిస్తున్నప్పుడు ఆశ్రద్దగా రోడ్డు దాటొద్దు అత్యవసరం గా నడిచేటప్పుడు , వాహనాలు నడిపేటప్పుడు డ్రైనేజీలు , మ్యాన్హొల్స్ ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి ఈ జాగ్రత్తలు తీసుకుంటు ఈ తుఫాను పోయేవరకు ప్రజలంతా సురక్షితంగా ఉండాలని దైద రవీందర్ – కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular