మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం : శతాబ్ది టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కాసు శ్రీనివాస్ రెడ్డి.
తలకొండ పల్లి గ్రేట్ తెలంగాణ న్యూస్.
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల పరిధిలోని లింగరావుపల్లి గ్రామానికి చెందిన చేన్నమోని జంగయ్య 24.08.2024 నాడు ఉదయం ఆకస్మికంగా మరణించడం జరిగింది, ఈ విషయం గ్రామానికి చెందిన నాయకుల ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు శతాబ్ది టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కాసు శ్రీనివాస రెడ్డి గారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 4000 రూపాయలు ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు పర్దేపురం యాదయ్య తన వంతు సహాయంగా 1000 రూపాయలు మొత్తంగా 5000 రూపాయలు మృతుడి కుటుంబానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్దేపురం యాదయ్య , బాలయ్య, శేఖర్, రామచంద్రయ్య, సైదులు, చెన్నకేశవులు తదితర గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.