వినాయక విగ్రహాలు తయారు చేసిన షెడ్ల మధ్య ఘర్షణ..
ఇరు వర్గాల మధ్య GST బిల్లు కోసం ఘర్షణ…
కేతేపల్లి ఆగస్టు 25, గ్రేట్ తెలంగాణ న్యూస్ ,
నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామం వద్ద వినాయక విగ్రహాలు తయారు చేసిన షెడ్లలో ఇరు వర్గాల మధ్యన భారీ ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలు దుర్భాషలాడుకొని గుద్దుకున్నారని స్థానికుల ఆరోపించారు.
ఈ విషయంపై నకిరేకల్ కేతపల్లి పోలీసులకు సమాచారం అందించగా ఇరు వర్గాల వారిని కేతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారని స్థానికులు తెలిపారు. వినాయక విగ్రహాలు అమ్మే సమయంలో జీఎస్టీ తో కూడిన బిల్లులు ఇవ్వకుండా మాన్యువల్ గా వారు తయారు చేసిన ఫేక్ బిల్లుల ఇచ్చి కోట్లల్లో ఈ బిజినెస్ దందా కొనసాగిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు తెలిపారు. ప్రభుత్వానికి రావలసిన జీఎస్టీ డబ్బులు ఎగ్గొట్టి ప్రభుత్వా ఆదాయానికి గండి కొట్టి జిఎస్టి బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వానికి ఎగనామం పెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు . దీని పై కొంతమంది స్థానిక అధికారులు బిజినెస్ దార్ల వద్ద కొంత ముడుపులు తీసుకొని చూసి చూడనట్లు గా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇనుపాముల గ్రామం నకిరేకల్ కు అతి సమీపంలో రోడ్డు వెంట వినాయక విగ్రహాల బిజినెస్ చేస్తున్న యాజమాన్యంపై స్థానిక అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆదాయాన్ని గండి పడకుండా ఖచ్చితమైన జీఎస్టీ తో కూడుకున్న బిల్లులతో వినాయక విగ్రహాల విక్రయాలు జరపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.వినాయక విగ్రహాల తయారీలో నానారకాల క్రేమికల్స్ సిమెంట్ సున్నం రసాయాలు వాడుతూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న వీరిపై పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ . జిల్లా ఎస్పీ స్పందించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే జీఎస్టీ బిల్లులు ఇక్కడ ప్రవేశపెట్టి వినాయక విగ్రహాల క్రయ విక్రయాలు జరపాలని నకరేకల్ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ విగ్రహాల తయారీ కొనసాగుతుందని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం గండి కొట్టకుండా చూడాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సూపర్ న్యూస్