వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం: జాతీయ మాలల ఐక్య వేదిక తెలంగాణ అధ్యక్షులు కరణం కిషన్.
*ఎస్సీ వర్గీకరన రాజ్యాంగ విరుద్ధం: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జీ.చెన్నయ్య.*
హైదరాబాద్ గ్రేట్ తెలంగాణ న్యూస్:
వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని జాతీయ మాలల ఐక్య వేదిక తెలంగాణ అధ్యక్షుడు కరణం కిషన్ అన్నారు, భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలలు,
మాల మహానాడు కార్యకర్తలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహాం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరణం కిషన్ మీడియాతో మాట్లాడుతూ,
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని
అన్నారు. వర్గీకరణ పై తీర్పు నిచ్చే అధికారం సుప్రీం కోర్టుకు లేదని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జీ చెన్నయ్య మాట్లాడుతూ, ఎస్సి వర్గీకరణ రాజ్యాంగ విరుద్దం అని, ఆర్టికల్ 341కు వ్యతిరేకమని ఆయన అన్నారు.
దేశంలోని అన్ని ఎస్సీ ఎస్టీ సంఘాలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి బహుజన సమాజ్ పార్టీ మాయావతి గారు లోక్ జనశక్తి పార్టీ కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్ గారు రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు మాల మహానాడు మాల సంఘాల జేఏసీ ఎస్సీ వర్గీక న వ్యతిరేక పోరాట సమితి అలాగే ఉత్తర భారత దేశంలోని మాదిగలంతా ఎస్సీ వర్గీకరనను వ్యతిరేకిస్తున్నారని చెన్నయ్య పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంజాబ్ హైకోర్టు ఐదుగురు జడ్జిల్లా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ ఆర్టికల్స్ ప్రకారమైతే వర్గీకరణ చల్లదని చెప్పాయో అవే ఆర్టికల్స్ ప్రకారం ఇప్పుడు వర్గీకరణ చేయొచ్చని చెప్పడం విడ్డూరం అన్నారు రాజ్యాంగ సవరణ జరగకుండా ఆర్టికల్స్ మార్చకుండా వర్గీకరణ చేయాలని చెప్పడం కరెక్ట్ కాదన్నారు సుప్రీంకోర్టు తీర్పు క్రిమిలేయర్ను అమలు చేయాలని చెబితే దాన్ని అమలు చేయమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయకపోవడం తన ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు వెంటనే ఎస్సీ వర్గీకరణను క్రిమిలేయర్ ను ఉపసంహరించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కరణం కిషన్, గోపోజి రమేష్ బాబు, మన్నె శ్రీధర్ రావు, బూర్గుల వెంకటేశ్వర్లు, భాను ప్రకాష్, తాలూకా రాజేష్, బండి ఆనంద్ రావు, గోకుల్, కళ్యాణ్ బైండ్ల శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్, చల్ల పవన్, బుద్ధిష్టి సొసైటీ రత్నం సురేష్, లలిత, స్వరూప, రాణి తదితరులు పాల్గొన్నారు.