రోడ్డు ప్రమాదంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి.
తుంగతుర్తి ఆగస్టు 21 గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
రోడ్డు ప్రమాదంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన బుధవారం వేములపల్లి మండలంలోని భీమవరం సూర్యాపేట రహదారిపై పచ్చర్గడ్డ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన జలగం రాములు( 53) సూర్యాపేట నుండి మిర్యాలగూడ వెళ్తుండగా యూరియా లోడుతో సూర్యాపేట వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.విజయ్ కుమార్ తెలిపారు.