మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.
తలకొండపల్లి, గ్రేట్ తెలంగాణ న్యూస్.
ఈరోజు తలకొండపల్లి మండలంలోని లింగరావుపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ చేనమొని జంగయ్య మృతి చెందడం జరిగింది.ఈ విషయం టెకురి శివలింగం ద్వార తెల్సుకుని మృతుడి భార్య సత్యమ్మ కుటుంబానికి 3000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.కుటుంబానికి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజమొని అంజయ్య, బిక్షపతి, సత్యనారాయణరెడ్డి, కృష్ణయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.