విద్యుత్‌సౌధను ముట్టడించిన ఎస్సీ, ఎస్టీ ఇంజనీర్స్.
రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని.
టీఓఓ 954ను రద్దు చేయాలని డిమాండ్.
హైదరాబాద్ గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
దశాబ్దాలుగా అమల్లో ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం బుధవారం విద్యుత్‌సౌధ ముందు ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యామ్‌మనోహార్, ప్రధాన కార్యదర్శి మేడి రమేష్‌లు మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో గత ప్రభుత్వంలోని యాజమాన్యం ఎలాంటి జీఓలు లేనప్పటికీ దొడ్డిదారిన తీసుకొచ్చిన టీఓఓ 954, ఎన్‌ఓఓ 37, ఎస్‌పీఓఓ101, టీజీఓఓ 62లను వెంటనే రద్దు చేసి, ఉద్యోగులు సీనియార్టీ జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్‌లో వచ్చిన పోస్టుల్లో సీనియార్టీని రోస్టర్ విధానంలో నిర్ణయించి ఇచ్చిన అడ్‌హాక్ ప్రమోషన్లను రెగ్యులరైజ్ చేసి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. అంతే కాకుండా కాన్‌సీక్వెన్సీయల్ సీనియారిటీని అమలు చేస్తూ ఉద్యోగులందరికీ ఇచ్చిన అడ్‌హక్ ప్రమోషన్లు రెగ్యులరైజ్ చేయాలని, రెండో శ్రేణి పౌరులుగా చూపబడుతున్న 23 వేల మంది ఆర్టిజన్లకు ఏపీబీఎస్‌ఈబీ రూల్స్‌ను వర్తింపజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ మనోహర్. స్టేట్ జనరల్ సెక్రెటరీ రమేష్ మేడి, నాంపల్లి. చంద్రయ్య. సోమ్లా నాయక్. వివిధ సంఘాల. వివిధ కంపెనీల ప్రతినిధులు నారాయణ నాయక్. నాగరాజు. ఆనంద్ బాబు. బీచ్ పెళ్లి. ఆనందం. కుమారస్వామి. సత్యనారాయణ. శరత్ బంద. రవీందర్. కృష్ణ. వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.