నియామక పత్రం అందజేసిన గంద మల్ల ఆనంద్ గౌడ్.
మేడ్చల్/ నాగారం, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
బీజేపీ ఓ బీ సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గంలోకి నాగారం పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, సుపీరియర్ లాబ్స్ అధినేత వెంగళ మధుసూదన్ కు నియామక పత్రం అందజేయడం జరిగింది,
బిజెపి సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, చిత్తశుద్దితో వ్యవహరిస్తు, సహచర కార్యకర్తలతో, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు, తమ ప్రాంతంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడముతో పాటు పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచి అన్ని వర్గాలలో పార్టీని మరింత విస్తరించడానికి తమ వంతుగా కృషి చేసున్ననందుకు సమాజం లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ అభివృద్ధికి అవసరమైన సేవలు చేస్తున్నందుకు గాను బిజేపి ఓ బీ సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఓ బీ సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు గంద మల్ల ఆనంద్ గౌడ్ బీజేపీ పార్టీ ఆఫీస్ లో నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎదిగిన శ్రీరాములు, వెంగళ మధుసూదన్ నేతలకు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంధ మల్ల ఆనంద్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు, ప్రధాన కార్యదర్శి శ్రీ నందనం దివాకర్, ప్రధాన కార్యదర్శి శ్రీ ఈశ్వరప్ప , ఉపాధ్యక్షులు శ్రీ సదానంద ముదిరాజు, రాష్ట్ర కార్యదర్శి గుండ్ల ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఈ బాధ్యతలు స్వీకరించడం జరిగింది,
వెంగల మధుసూదన్ మాట్లాడుతూ . ....
నా ఈ బాధ్యతలకు కారణమైన. ప్రతీ ఒక్కరికీ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి,ఉపాధ్యక్షులు సంజయ్ గణాటి, గొంగళ్ళ మహేష్, కాలేరు రామోజీ, బొడ్డు రవి కి కృతజ్ఞతలు తెలియజేశారు.