పేదలకు మెరుగైన వైద్య సేవలు: పెద్ది శంకర్ గౌడ్
రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం.
ఎల్బీనగర్: గ్రేట్ తెలంగాణ ప్రతినిధి
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ చైర్మన్ పెద్ది శంకర్ గౌడ్ అన్నారు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ చెరువుకట్ట, శంకేశ్వర బజార్ ప్రాంతాలలో గురువారం ఉదయం ముత్తూట్ ఏం జార్జ్ ఫౌండేషన్ సహకారంతో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ది శంకర్ గౌడ్ మాట్లాడుతూ వైద్య పరీక్షలు చేయించుకోలేని నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు తమ సంస్థ ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. ఈ శిబిరంలో కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధులు, లివర్ వ్యాధులు, షుగర్ వ్యాధులు, బీపీ వ్యాధులకు పరీక్షలను ఉచితంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్.రాంరెడ్డి, సీహెచ్.మధు, శివ నేత, సిబ్బంది పాల్గొన్నారు.