గ్రేట్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన డిప్యూటీ తహశీల్దార్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు రమేష్.
మనోహరబాద్ ఫిబ్రవరి 26, గ్రేట్ తెలంగాణ న్యూస్.
మెదక్ జిల్లా మనోహరబాద్ మండల గ్రేట్ తెలంగాణ ప్రతినిధి సత్యం, డిప్యూటీ తహశీల్దార్ కౌశిక రెడ్డి, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు రమేశ్ చేతులమీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేవారు రిపోర్టర్లు మాత్రమే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మనోహరబాద్ మండల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు రమేశ్, రిపోర్టర్ శ్రీకాంత్, రిపోర్టర్ నాగేష్ తదితర జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు.