Monday, December 23, 2024

వెంగల మధుసూదన్, గుడిమల్లం పుండరీకం, సిరిపురం సతీష్ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.

అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఛైర్మెన్ చంద్రారెడ్డి. 

కీసర, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి,

నాగారం మున్సిపాలిటీ పరిధిలో సత్యనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వెంగల మధుసూదన్ మాట్లాడుతూ…ప్రతిసారి వినాయకుడిని ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరు ఎలాంటి విఘ్నాలు లేకుండా వినాయక చవితి జరుపుకోవాలని కులమతాలకు అతీతంగా ఈ వినాయక నిమజ్జనం జరగాలని అన్నారు, ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పలువురికి అన్నదానం చేసిన ఆయన వినాయకుడు అంటే విజ్ఞాలు లేకుండా చూసేవాడని భక్తి శ్రద్ధలతో వినాయకుడినీ పూజించి ఏది కోరుకుంటే అది జరుగుతుందని అన్నారు.

వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు, యువత ఐకమత్యంగా కలిసి వినాయక చవితి వేడుకలను జరిపించడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని, బాల గంగాధర్ తిలక్ చూపిన దారిలో యువత నడవడం ఎంతో ఆనందంగా ఉందని అయన అన్నారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ పాలనలో ఈ వేడుకలకు ప్రాముఖ్యతను సంతరించుకుందని, తర్వాత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో దేశంలో అందరినీ ఒక్కటిగా చేసేటందుకు బాల గంగాధర్ తిలక్ గణపతి ఉత్సవం, శివాజీ ఉత్సవాలను ప్రారంభించారని, భారతీయుల పూజా మందిరాలలో జరిగే గణేష్ పూజలు, సామూహిక పూజలు సామాజికమైన, సార్వజనీకమైన ప్రాధాన్యతను అందించేందుకు తిలక్ చేసిన కృషి అనన్య సామాన్యం అనీ తలచిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా దిగ్విజయంగా పనులు పూర్తి కావాలంటే ఆ గణనాయకుడిని పూజిస్తే చాలు అని అన్నారు . ఈ రోజు ప్రజలకు అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలను ఛైర్మెన్ ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో అన్న ప్రసాదం దాతలుగా వెంగళ మధుసూదన్, గుడిమల్లం పుండరీకం, సిరి పురం సతీష్ పాల్గొనగా,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, బిజెపి నాయకులు రవీందర్ రెడ్డి, నాగులు, కాలనీ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, అసోసియేషన్ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular