శ్రీశైలంలో ఘనంగా శ్రీ గాయత్రి గీతా జ్ఞాన జప యజ్ఞ మహోత్సవాలు
అఖిల భారత పద్మశాలీయుల నిత్యాన్నదాన సత్రంలో ఘనంగా రాక్షాబంధన్ వేడుకలు పూజకు అధిక సంఖ్యలో హాజరైన అశేష భక్తజనం
శ్రీశైలం గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
శ్రీరామ రామ 54వ శ్రీ గాయత్రి గీతా జ్ఞాన జప యజ్ఞ మహోత్సవాలు శ్రీశైలంలోని అఖిల భారత పద్మశాలీయుల నిత్యాన్నదాన సత్రంలో ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా గురువారం సత్రం ఆవరణలో శిరందాసు రాములు సిద్ధాంతి పర్యవేక్షణలో యజ్ఞ జప మహోత్సవాలు భక్తుల జయజయధ్వానాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు ప్రణవ పతాకావిష్కరణ, అఖండ దీపారాధన, పటావిష్కరణ, సర్వదేవతా పూజలు పద్మశాలి బ్రాహ్మణులచే నిర్వహించడం జరిగిందని సత్రం అధ్యక్షులు వర్కాల సూర్యనారాయణ తెలిపారు. అదేవిధంగా గాయత్రి ధారణ, రాఖీ బంధన్, గాయత్రి జప జ్ఞాన యజ్ఞం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సత్రం కార్యనిర్వాహక అధ్యక్షులు కర్నాటి శ్రీధర్, ఉపాధ్యక్షులు గోశిక యాదగిరి, గంజి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శులు జీరపు చంద్రశేఖర్, పున్న శ్రీనివాస్, కోశాధికారి రావిరాల చిన వీరయ్య, కార్యదర్శులు ఏలె యాదయ్య, రుద్ర మహాలక్ష్మి, కార్యాలయ కార్యదర్శి తుమ్మ సత్యనారాయణ, సభ్యులు బొల్ల రాములు, నారని నర్సింహ, మేనేజర్ వేల్పుల కృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ గోవిందరాజులు, కార్యాలయ సిబ్బంది రాజేశ్వరి, డాక్టర్ చిలివేరు శ్రీనివాస్, భక్తులు పాము వైకుంఠం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.