శ్రీశైలం పద్మశాలి అన్నదాన సత్రంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
శ్రీశైలం గ్రేట్ తెలంగాణ ప్రతినిధి:
శ్రీశైలం క్షేత్రంలోని అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలీయుల నిత్యాన్నదాన సత్రం ఆవరణలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. జాతీయ జెండాను సత్రం అధ్యక్షులు వర్కాల సూర్యనారాయణ ఎగురవేశారు. ఈ సందర్భంగా భక్తులకు, సత్రం సిబ్బందికి మిఠాయిలను పంపిణీ చేశారు. అనంతరం అధ్యక్షులు వర్కాల సూర్యనారాయణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయులు చూపిన మార్గంలో యువత పయనించి దేశానికి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. పద్మశాలి నిత్యాన్నదాన సత్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్రం కార్యనిర్వాహక అధ్యక్షులు కర్నాటి శ్రీధర్, ఉపాధ్యక్షులు గోశిక యాదగిరి, గంజి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శులు జీరపు చంద్రశేఖర్, పున్న శ్రీనివాస్, కోశాధికారి రావిరాల వీరయ్య, కార్యదర్శులు ఏలె యాదయ్య, రుద్ర మహాలక్ష్మి, కార్యాలయ కార్యదర్శి తుమ్మ సత్యనారాయణ, సభ్యులు చిలువేరు చంద్రయ్య, ఏలె లక్ష్మీనారాయణ, యర్రమాద రాములు, బొమ్మ రాములు, వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అరుణ్ అమృతవార్, మేఘ సునీల్ చింతల్, నాగార్జున చిలివేరి, అధిక సంఖ్యలో వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.