ఆగస్టు 4 న తెలంగాణ మద్యం దుకాణాలకు సర్కార్ నోటిఫికేషన్.
గ్రేట్ తెలంగాణ జులై 02 హైదరాబాద్:
ఆగస్టు 02 ఎన్నికల ఏడాది ముందస్తు మద్యం దుకాణాలకు మహూర్తం ఖరారవుతోంది.వీలైతే ఈ ఏడాది కొంత ముందుగా అంటే ఆగష్టు 4న మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసేలా ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈనెల 4నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది.20 లేదా 21న లాటరీలను తీసి అదేరోజు దుకాణాలను కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.కాగా ప్రతీయేటా నవంబర్‌లో మద్యం దుకాణాలకు వీలుగా ఆబ్కారీ ఏడాది ఆరంభమవుతోంది.
అసెంబ్లి ఎన్నికల కోడ్ అక్టోబర్‌లో రానుందనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం కొంత ముందస్తు చర్యలకు సిద్దమవుతోంది.2021-23 ఏడాదులకు చెందిన కాలపరిమితి నవంబర్ 30తో ముగియనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమవుతున్నది.2023-25 రెండేళ్లకుగానూ ఏ4 లైసెన్సుల గడువు ముగిశాక డిసెంబర్ 1నుంచి అమలులోకి రావాల్సి ఉంది. డిసెంబర్ 1నుంచి కొత్త రిటైల్ మద్యం దుకాణాలు అందుబాటులోకి రావాల్సింది.కానీ డిసెంబర్‌లో ఎన్నికల కారణంగా ముందస్తు నోటిఫికేషన్తో ఈ ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందునుంచే జూలై 1నుంచి కొత్త పాలసీ మొదలవడం సాంప్రదాయంగా ఉండేది.అయితే 2014 తర్వాత తెలంగాణలో మూడు దశల్లో గడువు పెంచడంతో డిసెంబర్ 1నుంచి కొత్త దుకాణాల ప్రారంభం జరుగుతూ వచ్చింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 2620 మద్యం దుకాణాలుండగా, గతేడాది దరఖాస్తుల ద్వారానే రూ. 1400కోట్ల రాబడి సమకూరింది. ఇందులో గౌడ్‌లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం మద్యం దుకాణాలను రిజర్వ్ చేశారు. గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాలను రిజర్వేషన్ ద్వారా కేటాయించారు. మిగిలిన 1864 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. గతంలో రెండు బ్యాంకు గ్యారంటీలను ఇప్పుడు ఒకేసారి తీసుకోనున్నారు. దరఖాస్తు రుసుముగా రూ. 2లక్షలు వసూలు చేస్తున్నారు.ఖజానా కళకళలాడేలా, వ్యాపారుల ఫ్రెండ్లీగా నూతన మద్యం పాలసీ రూపొందనుంది. జీహెచ్‌ఎంసీలో రాత్రి 11 గంటల వరకు మద్యం విక్రయాలను నిర్వహించుకునేలా సమయాన్ని పెంచిన ప్రభుత్వం అదే ఒరవడితో వ్యాపారులకూ పలు ప్రయోజనాలను వర్తింపజేసింది.
ఏపీ వ్యాపారుల ఆశక్తిని గుర్తించిన ప్రభుత్వం ఆదాయార్జనే లక్ష్యంగా పాలసీలో సిట్టింగ్ రూములకు ఎటువంటి ఆనుమతిలకుండా శ్లాబుల పెరుగుదల, రెట్టింపు దరఖాస్తు రుసుముల వంటి కీలక మార్పులతో రెండేళ్లకు ప్రస్తుత మద్యం పాలసీని ప్రకటించింది. వ్యాపారులకు ఊరట కల్గించేలా టెండర్‌తోపాటే సమర్పించే దరావత్తు మొత్తాన్ని (ఈఎండి) రూ. 5 లక్షలనుంచి రూ. 2లక్షలకు తగ్గించడంతో పాటు, లైసెన్సు రుసుములకు గతంలోఉన్న 6 వాయిదాలను 8 వాయిదాలకు పెంచుతూ వ్యాపారులనుంచి పెద్ద మొత్తంలో స్పందన వచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ. లక్ష ఉన్న తిరిగి చెల్లించబడని దరఖాస్తు రుసుమును రూ. 2 లక్షలకు పెంచగా, ఒక్కొక్కరు ఎన్ని దరఖాస్తులైనా సమర్పించేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.
గతంలో నాలుగు స్లాబులను 2011 జనాభా ఆధారంగా 6 స్లాబులకు పెంచడంతోపాటు, గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాలకు దుకాణాల పనివేళలు ఉదయం 10నుంచి రాత్రి 11 గంటలవరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించింది. దరఖాస్తులకు జిల్లా వారీగా ఈనెల 9 తర్వాత కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. లైసెన్సుల జారీనాటికి ఎవరూ రాకుండా మిగిలిపోయిన మద్యం దుకాణాలను టీఎస్‌బిసిఎల్ ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీబీసిఎల్ నుంచి మద్యం కొనుగోళ్లపై వ్యాపారుల టర్నోవర్ టాక్స్‌ను 8శాతంగా నిర్ణయించిన ప్రభుత్వం, లైసెన్సు ఫీజుకంటే ఏడాదిలో 7రెట్లు మించిన అమ్మకాలపై 14.5 శాతం అదనపు ప్రివిలేజ్ ఫీజును వసూలు చేయనున్నారు. వ్యాపారులకు మద్యం విక్రయాలపై లాభం మార్జిన్‌లను కూడా ప్రకటించారు. ఆర్డినరీ మద్యంపై 27వాతం, మీడియం మద్యంపై 20శాతం, ప్రీమియం, విదేశీ మద్యం, బీర్లపై 20శాతం లాభం మార్జిన్‌ను పాలసీలోనే ప్రకటించారు……