Monday, December 23, 2024

నగ్నంగా నడిచింది మహిళ దేహం కాదు. అది మన దేశ మానం.. అభిమానం.

నగ్నంగా నడిచింది మహిళ దేహం కాదు. అది మన దేశ మానం.అభిమానం….

జన మనిషి జే ఎస్ ఆర్ కన్నీటి లేఖ .

గ్రేట్ తెలంగాణ ప్రతినిధి హైదరాబాద్

యుగాలు దాటొచ్చిన మనిషిని మృగాలుగా మార్చింది ఎవ్వడు ? పాలిచ్చిన అమ్మల రొమ్ములను బరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికి ఊతమిచ్చింది ఎవ్వడు ?

వేట కుక్కల్ని ఉసి గొల్పింది ఎవ్వడు ?విధ్వేషాన్ని రక్తనాళాలలోకి ఎక్కించింది ఎవ్వడు?తల్లుల జననాంగాల మీద తాండవ మాడిన గాడిద కొడుకులను కనిపెంచింది ఎవ్వడు ? నెత్తురుని మరిగించింది ఎవ్వడు ? కత్తులను నూరించింది ఎవ్వడు ?పరమత ఆలయాలను కూల్చింది ఎవ్వడు? ఉసురు తీసి ఉత్సవం చేసింది ఎవ్వడు ?మంటలను రాజేసింది ఎవ్వడు?  గిరిజన పంటలను కాల్చేసింది ఎవ్వడు ?

మదమెక్కి ఆడబిడ్డలపై మానభంగం చేసిన మతోన్మాద మూకలకు నూకలు ఇస్తున్నది ఎవ్వడు?పాకలు వేసి “భక్షణ శిక్షణ”అందిస్తున్నది ఎవ్వడు ?

ఎవ్వడురా విషాన్ని విరజిమ్ముతున్నది ద్వేషాన్ని దేశంపై వెదజల్లుతున్నది  మతాన్ని మంటలకు ఇంధనం చేస్తున్నది పచ్చని గసగసాల పైరు కొండల మణిపూర్ కన్నుల కుండల నిండా మరిగే వెచ్చిని నీరును నింపుతున్నది వాడు….వాడెవడంటే….!!

ఛాందస పీఠంపై పీటలు వేసుకొని మౌడ్య సిరాచుక్కలను మౌన కలంలోకి ఒంపుకొని రణ మరణ శాసనాలు లిఖిస్తున్నాడు.మన జీవన గమనాలను శాసిస్తున్నాడు. అయితే….. !ఇప్పుడు వాడు అనుకుంటున్నట్టు …!!మణిపూర్ నడి వీధుల్లో నగ్నంగా నడిచింది దేహం కాదు*”అది దేశం”.*పాశవిక అత్యాచారం జరిగింది మానం మీద కాదు “వాడి మౌనం మీద”ఇంత జరుగుతుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయ్?’ అని సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జై బొరన్నా గా పిలవబడే జె ఎస్ అర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రికి రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించారు.

మణిపుర్లో మహిళలను నగ్నంగా ఊరేగించడంపై జైబోరన్న గారి సుభాష్ చంద్రబోస్ రాజా జె ఎస్ ఆర్ విచారం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ముర్ము, బీజేపీ ప్రభుత్వం,ఎస్టీ కమిషన్, మానవ హక్కుల సంఘం, మీడియా ఎక్కడికి వెళ్లాయని పోరాకుల ప్రజాతంత్ర ఉద్యమకారుడు జెఎస్ఆర్ ప్రశ్నిస్తున్నారు. తాలిబన్లు మహిళలను టార్చర్ చేస్తే రోజు మొత్తం వార్తలు ఇచ్చే మీడియా.. సొంత దేశంలో ఘటనలు కనిపించట్లేదా అని సిపిఐ ఎం ఎల్ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జైపూర్ అన్నగారి సుభాష్ చంద్రబోస్ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు

కేంద్ర రాష్ట్ర పాలకుల. ప్రభుత్వాల మౌనం ఎంత ప్రమాదమో…..మన ప్రజల మౌనం అంతకంటే ప్రమాదం … నేరం చేసిన వాడు మాత్రమే నేరస్తుడు కాదు…. నేరాన్ని చూస్తూ సహించిన ప్రతి ఒక్కరు నేరస్తులేనని… బాధితుల బంధువు…భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ జే ఎస్ఆర్ ఆరోపించారు.బహుజన సామాజిక ఉద్యమకారుడు , ప్రజా నేస్తం కామ్రేడ్ జే ఎస్ ఆర్ కన్నీటి ఆవేదనను దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏమాత్రం పట్టించుకోవడంలేదని… భారతీయ జనతా రాజ్యం బిజేఆర్.ప్రెసిడెంట్ బి .జె .ఆర్ .సర్దార్ పటేల్ పేర్కొన్నారు.

మణిపూర్ మారణకాండను , భరతమాతలపై జరిగిన పైశాచిక అత్యాచార దాడులను తీవ్రంగా ఖండించాలని ప్రజాతంత్ర ఉద్యమకారుడు సామాజిక ప్రజాపరివర్తకుడు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ నేతాజీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు… ఉన్మాద రాజకీయాలను , వాటి సైద్ధాంతిక భావజాలాన్ని తిప్పి కొట్టాలని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ జెఎస్ఆర్ నేతాజీ ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు ప్రజాసంఘాల నేతలకు అనుక్షణం అణగారిన వర్గాల సంక్షేమం కోరుకునే శాంతికాముకుడు..ప్రతి దినం జనహితమే అభిమతమైన శ్రామిక వర్గ రాజ్యాధికార పోరాట యోధుడు,, రైతు కూలీ బిడ్డ, ప్రజా ఉద్యమాల పెద్దన్న… కార్మిక వర్గ పుత్రుడు సిపిఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular