చంద్రయాన్ 3 చూడడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
గ్రేట్ తెలంగాణ ప్రతినిధి తిరుపతి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది.2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. చంద్రయాన్ 2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించనుంది ఇస్రో. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే చంద్రాయన్ స్పేస్ క్రాఫ్ట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. దీన్ని జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3తో అనుసంధానించింది. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్లేది ఈ రాకెట్టే కాబట్టీ ప్రయోగించిన తేదీ నుంచి 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది . ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యేలా ఇస్రో ప్రణాళికలను వేసుకుంది. రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయాలనేదే ఇస్రో ప్రయత్నం.గతంలో చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైన నేపథ్యంలో ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.
*ఏపీ ఎస్ ఆర్టీసి ప్రత్యేక బస్సులు ఎర్పాటు*
ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రానికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడిపించనున్నారు. శ్రీకాకుళం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నుంచి ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు శ్రీహరికోటకు బయలుదేరుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం, నెల్లూరు బీచ్, పులికాట్, నేలపట్టు పక్షుల అభయారణ్యాలను సందర్శించిన అనంతరం రాకెట్ లాంచింగ్ ప్రదేశానికి చేరుకుంటుంది.