ప్రజా సంక్షేమం సుభిక్ష పాలన భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం : రవికుమార్ యాదవ్.
మార్చి 25 ( గ్రేట్ తెలంగాణ రిపోర్టర్). శేర్లింగంపల్లి, మాదాపూర్ డివిజన్, సాయి నగర్ నుండి గోపాల్ ముదిరాజ్ , మహేందర్ ఆధ్వర్యంలో యువకులు భారతీయ జనతా పార్టీలో చేరగా వారిని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా అహ్వానించిన బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే గాంధీ ఇన్నాళ్లుగా ప్రజలకు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గాన్ని అవినీతికి, అక్రమాలకు , భూ కబ్జాలకు అడ్డాగా మార్చారన్నారు. బి.ఆర్.ఎస్ నాయకులు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తూ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో మంజీరా పైప్ లైన్లు, రోడ్లు, డ్రైనేజీ లైన్లు, ఇళ్ళ పట్టాలు ఇచ్చింది, అభివృద్ధి పనులు చేసింది, ప్రజలకు సేవ చేసింది పి.జే.ఆర్ , బిక్షపతి యాదవ్ మాత్రమేనని తెలియజేశారు , వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల వెంట ,ప్రజలకోసం పని చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది, గడచిన 9 ఏళ్లలో కేసిఆర్ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని,ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, పరీక్షా ప్రశ్న పత్రాల లీకేజీ ఇలా అన్ని విధాలుగా నిరుద్యోగులను నట్టేట ముంచారని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని ఇవ్వలేదు, ఆర్.టి.సి. చార్జీలు పెంచారు, కరెంట్ బిల్లులు పెంచారు, ఇలా అన్ని వర్గాల ప్రజలను దొంగ హామీలతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని తెలియజేశారు, మీకు అండగా నేనున్నా, భారతీయ జనతా పార్టీ ఉందని , మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. పార్టీలో చేరిన వారు శంకర్ , సత్యరాజ్, అంజి, బిక్షపతి యాదవ్, రమణయ్య యాదవ్, శ్రీను ,విజయ్ వారి మిత్రులు, స్థానిక కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, వెంకటేష్ యాదవ్, మదనా చారి, చండప్ప శ్రీను, మధు యాదవ్, గోవర్ధన్ రెడ్డి, నరేష్, రమేష్, వెంకట కృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.