ఘనంగా రాష్ట్ర యువమోర్చ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు
మార్చ్ 24:( గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).
శేర్లింగంపల్లి నియోజకవర్గం నేడు రాష్ట్ర యువమోర్చ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ జన్మది సందర్బంగా కొండాపూర్ డివిజన్ సిద్ధిక్ నగర్ లోని అభిమానుల మధ్య పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సిద్దిక్ నగర్ లోని ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు, అనంతరం దేవాలయం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొని పుట్టినరోజు సందర్బంగా కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం చౌరస్తాలో సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, పురుషోత్తం గౌడ్ ,దాచే కృష్ణ, రేఖమ్మ , సరోజరెడ్డి, ఆంజనేయులు సాగర్, చెన్నయ్య సాగర్, ఈసేవ రవి బల్లు యాదవ్, ఖాజాసాగర్, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.