*ఎంపీ రంజిత్ రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహం ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకొని కష్టపడి చదవాలి :: వెంకటేష్ గౌడ్.
మార్చ్ 21 (గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).
శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ , శంశిగుడా ప్రభుత్వ పాఠశాలలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సహకారంతో పదోవ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు అందించిన ఎగ్జామ్స్ ప్యాడ్ లను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, పిల్లలందరూ బాగా చదివి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుని మీ తల్లితండ్రులకు , చదువు చెప్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. గొప్పగా చదివి, ప్రపంచంతో పోటీ పడి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని అని పిల్లలందరికి ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేశారు. పదోవ తరగతి చదువుతున్న పిల్లలకు ఎక్సామ్ ప్యాడ్లు అందించిన చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, సంతోష్ బిరాదర్, ఎజ్జస్, అధ్యపకబృందం కె.రాధా పద్మజ, అనురాధ, గోవింద్, రామలక్ష్మి, కె.మోహన్ రావు, కె.ఆనంతయ్య, ఎం.ప్రేమ్ కుమార్, వెంకటేశ్వరరావు, రాములు, సంధ్యారాణి, మాణిక్యం, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.